నవీన్‌ పొలిశెట్టి ఇప్పుడు సిద్దు పొలిశెట్టి

Update: 2022-12-26 09:14 GMT
జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా యంగ్‌ సెన్షేషనల్‌ హీరోగా పేరు దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి తదుపరి సినిమా విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు. జాతిరత్నాలు విడుదల అయ్యి ఇంత కాలం అయినా కూడా తదుపరి సినిమా ఇంకా రాలేదు. తదుపరి సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.

నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం మహేష్‌ దర్శకత్వంలో అనుష్క తో కలిసి ఒక సినిమా ను చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్‌ గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది.

తాజాగా నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సిద్దు పొలిశెట్టిగా కనిపించబోతున్నాడు. స్టాండప్ కమెడియన్‌ గా సిద్దు ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

జాతిరత్నాలు సినిమాలో తన కామెడీ టైమింగ్‌ తో అలరించిన నవీన్‌ పొలిశెట్టి ఈసారి సిద్దు పొలిశెట్టిగా స్టాండప్‌ కామెడీ చేస్తూ మరింతగా నవ్వించడం ఖాయం అంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సిద్దు పొలిశెట్టి లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదల తేదీ కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News