గత కొంతకాలంగా అందాల నయనతార దేవాలయాల విజిట్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకుముందు ప్రియుడు విఘ్నేష్ తో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశుని సందర్శించిన నయన్.. తాజాగా కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయాన్ని సందర్శించడం అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది.
అమ్మవారి ఆలయానికి వెళ్లడమే గాక అక్కడ విఘ్నష్ తో కలిసి నయన్ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానంతరం అర్థగంట సేపు వీరిద్దరూ ఆలయంలోనే ఉన్నారు. అయితే ఈ ఆలయాల విజిట్ వెనక కారణమేంటి? అంటే.. ప్రస్తుతం నయన్ ఓ ధీక్షలో ఉన్నారు. ఆర్.జె.బాలాజీ డైరెక్షన్లో `మూక్కుత్తి అమ్మన్` సినిమాలో అమ్మవారిగా నటిస్తున్నారు. అయితే మూవీలో నటించినన్ని రోజులూ ఆమె మాంసాహారాన్ని ముట్టుకోనని శపథం చేశారట. అత్యంత దీక్షతో నయన్ అమ్మవారి పాత్రలో నయనతార నటిస్తున్నారట.
భక్తి ప్రధాన పాత్రలో నటిస్తే నయనతార కమిట్ మెంట్ వేరు. ఇంతకుముందు శ్రీరామరాజ్యం సినిమాలో నటించేప్పుడు నయన్ ఇంతే కఠిన ధీక్ష చేపట్టారు. పాత్రలో పరకాయం చేయడానికి నియమం పాటించడంపై బాలయ్య ప్రశంసలు కురిపించారు అప్పట్లో. సీతగా మెప్పించేందుకు నార దుస్తుల్లో నయన్ శాఖాహారాన్ని మాత్రమే తినేవారు. ఇక నయనతార పూజించే దేవుడు ఏసుప్రభువు. కానీ దేవాలయాల విజిట్ ని గౌరవించడం అభిమానుల్లో అన్ని వేళలా చర్చనీయాంశమే.