న‌య‌న్- విఘ్నేష్ జంట‌కు క‌వ‌ల‌లు

Update: 2022-10-09 16:51 GMT
నయనతార - విఘ్నేష్ శివన్ జంట‌ కవలలకు స్వాగతం పలికారు. వారికి మగపిల్లలు. ఈ జంట‌కు వివాహం జరిగిన నాలుగు నెలలకే పిల్ల‌లు క‌ల‌గ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే న‌య‌న్- విఘ్నేష్ కొన్నేళ్లుగా స‌హ‌జీవ‌నంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాము కవల అబ్బాయిలను స్వాగతించామ‌ని విఘ్నేష్ సోషల్ మీడియాలో ఈ వార్తలను ప్రకటించాడు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా కవలల పాదాలను ముద్దు పెట్టుకుంటున్న అరుదైన ఫోటోల‌ను పోస్ట్ చేశాడు.

ఉద్వేగానికి లోనైన విఘ్నేష్ ఫోటోలకు ఒక అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చాడు, ``నయన్ - నేను అమ్మ & అప్పగా మారాము. మేము ట్విన్ బేబీ బాయ్స్ తో ఆశీర్వాదం అందుకున్నాం. పిల్లలు మా ఉయిర్ & ఉలగం కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. జీవితం ప్రకాశవంతంగా మరింత అందంగా కనిపిస్తోంది. దేవుడు రెట్టింపు గొప్పవాడు`` అని ట్వీట్ చేసాడు.

కొన్ని సంవ‌త్సరాల పాటు డేటింగ్ చేసిన నయనతార- విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు 2022 జూన్ 9న మహాబలిపురంలో  పెళ్లి చేసుకున్నారు. నానుమ్ రౌడీ ధాన్ సినిమా షూటింగ్ లో ఉండగానే ఈ జంట ప్రేమలో పడింది. రెండేళ్ల తర్వాత సింగపూర్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో జంటగా కనిపించారు.

2021లో నయనతార తన సినిమా ప్రచారం కోసం విజయ్ టెలివిజన్ లో కనిపించింది. అక్కడ ఆమె తన రహస్య నిశ్చితార్థం గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ-``ఇది నా ఎంగేజ్‌మెంట్ రింగ్. మేం ప్రైవేట్ వ్యక్తులం కాబట్టి వేడుకను ఘనంగా నిర్వహించాలని అనుకోలేదు. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మేము ఖచ్చితంగా మా అభిమానులకు తెలియజేస్తాం. మా నిశ్చితార్థం మా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది`` అని తెలిపింది.

కెరీర్ మ్యాటర్ కి వ‌స్తే.. నయనతార ఇటీవలే తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన `గాడ్ ఫాదర్‌`లో కనిపించింది. విఘ్నేష్ శివన్ త‌దుప‌రి త‌ళా అజిత్ హీరోగా AK62 చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు.
Tags:    

Similar News