ఉన్నట్లుండి ‘లవ్ గురు’ అవతారమెత్తేసింది నయనతార. అయినా ప్రేమ పాఠాలు వల్లించడానికి తన కంటే సరైన వ్యక్తి ఇంకెవరుంటారు చెప్పండి. ఒకటికి రెండు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలున్నాయి. ఇప్పుడో సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ రన్ అవుతోంది. ఈ అనుభవంతో ప్రేమ గురించి ఓ పెద్ద లెక్చరే దంచింది నయన్. ఆమె ఏమంటోందో తన మాటల్లోనే విందాం పదండి. ‘‘షేక్స్‌పియర్ ‘ప్రేమ గుడ్డిది’ అన్నాడు. అలాగని గుడ్డిగా ప్రేమించేయకూడదు. ప్రేమలో ఉన్నప్పుడు కళ్లు తెరిచి ఉంచాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాక ఆ ప్రేమ ఎంతదాకా వెళుతుంది? సజావుగానే సాగుతుందా? లేదా అనే విషయాలను గ్రహించగలగాలి. ప్రేమ ఉద్వేగపూరితమైనది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడాలనుకుంటే ఎమోషనల్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్ రెండింటినీ బేరీజు వేసి చూసుకోవాలి. ఈ రెంటినీ ఆ వ్యక్తితో సమపాళ్లల్లో బ్యాలెన్స్ చేయగలం అనుకున్నప్పుడే పెళ్లాడాలి.
ఎవరి కోసమూ మనల్ని మనం మార్చుకోకూడదు. గతంలో నేను మారాను. కానీ, వర్కవుట్ కాలేదు. ప్రేమలో పడ్డపుడు మీరు మీరుగా ఉండండి. మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మీరు మారాలని కోరుకోడు. ఏ బంధంలో అయినా నమ్మకం ఉండాలి. అలాగని అతిగా నమ్మకూడదు. నమ్మితే మాత్రం వ్యవహారం బెడిసికొడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిపై నిఘా పెట్టమని నేననడంలేదు. అయితే అతని వ్యవహారం పూర్తిగా తెలుసుకోమంటున్నా. అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోమంటున్నా. ఆడవాళ్ల స్వేచ్ఛను ఇష్టపడని మగవాణ్ణి ప్రేమించొద్దు. ఆడవాళ్లంటే గౌరవం లేని మగవాళ్లను కూడా ప్రేమించకపోవడం బెటర్’’ అంటూ ప్రేమికులకు సూచనలిచ్చింది నయన్.
ఐతే నయన్ చెబుతున్న ప్రేమ పాఠాలన్నీ కూడా తన మాజీ ప్రేమికులు శింబు, ప్రభుదేవాలకు పంచుల్లాగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుదేవా మీద బాగానే సెటైర్లు వేసినట్లుంది నయన్. ఎందుకంటే తనకోసమే ఆమె మతం కూడా మారింది. తన మాజీ ప్రేమికులతో రిలేషన్ షిప్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకునే నయన్ ఈ పాఠాలు వల్లిస్తున్నట్లుంది. మరి కొత్త లవర్ విఘ్నేష్ శివన్ అయినా నయన్ కోరుకున్నట్లు ఉన్నాడా?