కొత్త ఆనందాల్లో నయనతార!

Update: 2015-04-23 11:30 GMT
తెరపైన హుషారుగా, తెరవెనక విషాదంగా నడుస్తుంది నయనతార జీవితం. కానీ... ఇది గతం! శింభూతో ప్రేమాయణం, ప్రభుదేవతో సహజీవనం వెరసి జీవితంలో చేదుజ్ఞాపకాలనే మిగిల్చాయి. దీంతో మాన్సికంగా ఎంతో నిరాశకు, ఒత్తిడికి గురయిన నయన తార చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. అంతే కాదు... చాలా హ్యాపీగా, కొత్త జోష్ తో కనిపిస్తుందట. ఒక వైపు సీనియర్స్ తో మరో వైపు కుర్ర హీరోలతో కలిసి నటిస్తూ... వెలుగువెలుగుతున్న నయనతారను చూసినోళ్లంతా... ఏమిటి కారణం అని ఆలోచిస్తున్నారట. సెట్ లో ఎప్పుడూ మూడీగా, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే నయన, ఈ మధ్య అందరితోనూ సరదాగా గడుపుతూ, తెగ జోకులు వేసేస్తుందట.
ఇక ఆపుకోలేని కొందరు కోలీవుడ్ జనం... అసలు విషయం తెలుసుకునే పనిలో పడ్డారట. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నయనతారా కొత్త ఆనండాల వెనక కారణం... త్వరలో నయనతార పెళ్లట. అది కూడా ఏ శింభుతోనో, ప్రభుదేవతోనో కాదు... తనను తానుగా ఇష్టపడే వ్యక్తితో అట. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు కానీ... అత్తగారు మాత్రం ఒక సీనియర్ తమిళనటి అట! దీంతో ఒకే ఫీల్డ్ లో ఉన్న అత్తగారు దొరికారన్న ఆనందం, ఇక ఈ ప్రేమల గోల లేకుండా హాయిగా పెళ్లిచేసుకోవచ్చనే ఆనందం మరోవైపు... కలిసి నయన తెగ ఖుషీగా ఉందని సమాచారం!
Tags:    

Similar News