అందాల నయనతార ప్రేమాయణాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ఆరంభంలో శింబుతో ప్రేమ... బ్రేకప్.. అటుపై కెరీర్ కీలక మలుపులో ప్రభుదేవాతో ప్రేమాయణం పెళ్లి వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. నయన్-ప్రభుదేవా మూడేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. ఏడడుగులు నడవడమే తరువాయి అనుకున్నారు. మీడియాలో ఈ జంటపై ఒకటే హైప్. కానీ అనూహ్యాంగా ప్రభుదేవా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. అలా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ బంధం అక్కడితో ముగిసింది. తర్వాత ఈ విషయంపై నయనతారకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. నయన్ నాటి నుంచి కొన్నాళ్ల పాటు కేవలం సినిమా షూటింగ్ లకే పరిమితమైంది. అప్పటి నుంచి మీడియా ఇంటర్వూలకు గానీ.. సినిమా ప్రచారానికి కాని హాజరవ్వడం లేదు.
ఆ తర్వాత యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లవ్ లో పడింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే నయన్ మీడియాకు కొత్త విషయాలు చెప్పేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఓ ఇంటర్వూలో తన రెండవ లవ్ స్టోరీ గురించి.. ప్రభుదేవా గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
ప్రభుదేవాతో విడిపోవడం నిజంగా జీవితం చిన్నాభిన్నామైనంత పనైందని వాపోయింది. ఆ సమయంలో మనసు ముక్కలైందని.. ఏం చేయాలో తోచని స్థితిలో ఒంటరి గా మిగిలి కుమిలిపోయనని తెలిపింది. ఆ ఘటన జరిగి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని.. విఘ్నేష్ తో ఉన్నా ఆ జ్ఞాపకాలు మరువలేకపోతున్నానని భావోద్వేగానికి గురైంది.