కోలీవుడ్ ప్రేమపావురాలు నయనతార-విఘ్నేష్ శివన్ గురించి తెలిసిందే. ప్రభుదేవాతో కటీప్ తర్వాత నయన్ విఘ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇద్దరి మధ్య కొన్నేళ్లగా రిలేషన్ కొనసాగుతోంది. ఒకే ప్లాట్ లో కలిసి ఉంటున్నారు. ప్రొఫెషనల్ కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా! వ్యక్తిగత స్వేచ్ఛకు కొంత సమయం కేటాయించి ఎంజాయ్ చేయడం ఈ జంట స్టైల్. సమయం దొరికనప్పుడల్లా ప్రేమపావురాల్లా...అలా దేశ..విదేశాలను చుట్టేస్తారు. ఒకరి పై ఒకరు ఎంత ప్రేమ కురిపించుకుంటారో? లీకైన ఫోటోలను బట్టి అభిమానులు అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
కానీ ఇన్నేళ్ల ప్రేమలో ఏరోజు ఇద్దరు ఓపెన్ గా ప్రేమించుకుంటున్నాం అని గానీ...పెళ్లి చేసుకుంటాం అని గానీ అధికారికంగా చెప్పింది లేదు. మా పని మేము చేసుకుంటూ పోతామంతే! అన్నట్లే వ్యవరించారు. తాజాగా మొన్న వచ్చి వెళ్లిపోయిన ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14 వెలైంటైన్స్ డే) ని పురస్కరించుకుని తాజాగా కొన్ని ఆసక్తికర ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇద్దరి ప్రేమకి 5 ఏళ్లు నిండాయి.
ఈ 5 ఏళ్ల ప్రేమకు సాక్షాలుగా ఇన్నేళ్ల కలిసి తిరిగిన...కలిసి గడిపిన క్షణాలను సంబంధించిన ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో విఘ్నేష్ షేర్ చేసాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంగతి కూడా చెప్పాడండోయ్. ప్రతి రోజు మాకు ప్రేమికుల రోజే....ప్రత్యేకించి ఓ రోజు అంటూ లేదన్నాడు. తన ముద్దుల ప్రియుల రాల గురించి గురించి పోయెటిక్ గాను స్పందించాడు. అంతా బాగానే ఉంది. కానీ పెళ్లి ఎప్పుడో మాత్రం అసలు సంగతి చెప్పకుండా తప్పించుకున్నాడు. ప్రస్తుతం నయనతార-సమంత హీరోయిన్లగా విఘ్నేష్ శివన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అజిత్ హీరో. ఇటీవలే ఇద్దరి మధ్య హీరో విషయమై వివాదం తలెత్తినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.