సోషల్ మీడియాలో కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు చాలా విచిత్రంగా కనిపిస్తుంటాయి. పలు అంశాల్లో నెటిజన్లు స్పందించే తీరు రోటీన్ కు భిన్నంగా ఉండటమే కాదు.. స్ఫూర్తి రగిలించేలా.. సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయి. అదే సమయంలో.. కొన్నిసార్లు మాత్రం మరీ ఇంత లేకీగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారన్న కోపం కలుగుతుంటుంది. కొందరి విషయంలో ఎంతో ఉన్నతంగా వ్యవహరించే సోషల్ మీడియా.. మరికొందరి విషయంలో మాత్రం చాలా కరాఖండిగా.. సీరియస్ గా వ్యవహరించటమే కాదు.. ఇరుకు మనస్తత్వాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంటుంది. దాదాపు రెండేళ్ల క్రితం బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ చనిపోయిన సంగతి తెలిసిందే.
ఆయన సతీమణి నీతూకపూర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంతనే.. ఆమెపై ట్రోల్ చేస్తున్న వారిని తాజాగా కడిగి పారేసింది. భర్త మరణించిన కొంతకాలం వరకు కామ్ గా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ అప్పుడప్పుడు పోస్టులు పెడుతున్నారు. దీనికి కొందరునెటిజన్లు స్పందిస్తూ.. భర్త చనిపోయాడన్న బాధ లేకుండా ఇలా పోస్టులు పెట్టి ఎంజాయ్ చేయటమా? అంటూ నోరు పారేసుకున్న తీరుపై ఆమె స్పందించారు. భారీ కౌంటర్ ఇచ్చారు. తన ఫాలోవర్స్ ను ప్రేమిస్తున్నానని.. తనను ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. తన భర్త చనిపోయాక కూడా ఎంజాయ్ చేస్తుందని తనను అంటున్నారని.. తాను ఏడుస్తూ.. విధవలా ఉండటాన్ని చూడాలనుకుంటున్న వారిని బ్లాక్ చేస్తానన్నారు.
యంగ్ హీరో రణబీర్ కపూర్ తల్లిఅయిన నీతూకపూర్.. తన భర్త గురించి.. ఇప్పటికి తమ జీవితాల్లో ఆయన ప్రభావాన్ని చెబుతూ.. ‘నేను నా భర్తను మరచిపోలేను. అతను ఎప్పుడూ ఇక్కడ నాతో.. నా పిల్లలతోజీవితాంతం ఉంటారు. ఇప్పుడు కూడా నాతోనే ఉన్నాడు. భోజనానికి వచ్చిన సగం సమయం అతని గురించే మాట్లాడుకుంటాం. రణ్ బీర్ ఇప్పటికి తన మొబైల్ స్క్రీన్ సేవర్ లో అతని ఫోటోనే ఉంది. ఆయన్ను మేమెంత మిస్ అవుతున్నామో అర్థం చేసుకోండి. అతన్ని మేం మిస్ అవుతున్నందుకు దిగులుగా లేదు.. మేం అతన్ని మిస్ కావటాన్నికూడా సంతోషంగా భావిస్తాం. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని తలుచుకున్న ప్రతిసారీ అనుకుంటాం’ అని పేర్కొన్నారు. తన మాటలతో తన భర్తతో తనకున్న ప్రేమాభిమానాల్ని చాలా గొప్పగా వివరించారని చెప్పాలి. ఇంత చెప్పిన తర్వాత కూడా ఆమె మీద నోరు పారేసుకునే వారిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.