ఇంకో నలభై ఎనిమిది గంటల్లో శ్రీనివాస కళ్యాణం తెరమీదకు వచ్చేస్తుంది. విపరీతమైన హైప్ తో టికెట్ల కోసం కొట్టుకునేంత ఓపెనింగ్ కాదు కానీ డీసెంట్ గా వచ్చే అవకాశం అయితే ఉంది. దానితోడు పబ్లిసిటీ కోసం దిల్ రాజు వేస్తున్న ప్లాన్స్ అన్ని ఇన్ని కావు. స్వీట్లు పంచడాలు పట్టు పంచెలు చీరలు ఇచ్చే స్కీములు ప్రకటించడం ఇవన్నీ విడుదలకు ముందే చేయటం చూసి సినిమా జనం ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ట్రైలర్ విడుదలైనప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేస్తాయి అనుకున్నారు. కానీ అంచనాలకు భిన్నంగా ఇప్పటి దాకా 3 మిలియన్లు మాత్రమే దాటింది. క్రేజ్ ని యూట్యూబ్ లో వీక్షకుల కౌంట్ ని బట్టి లెక్కిస్తున్న ట్రెండ్ లో ఇది తక్కువ అని చెప్పాలి. ఇప్పుడు 5 మిలియన్ మార్క్ అనేది కాస్త క్రేజ్ ఉన్న మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా వచ్చేస్తోంది. సో శ్రీనివాస కళ్యాణం అంతకు చాలా పైన ఉండాల్సింది.
విచిత్రంగా ఈ సినిమా విషయంలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం కొంత ఖంగారు కలిగించే విషయం. ఓ జంట మధ్య ప్రేమ పెళ్లి దాకా వెళ్లడం దానిని ఆర్భాటంగా చేయటం తప్ప ట్రైలర్ లో ఇంకేమి చూపకపోవడంతో సినిమాలో కూడా ఇంతే ఉంటుందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎంత ఫామిలీ టార్గెట్ మూవీ అయినా అందరు మొదటిరోజే తండోపతండాలుగా వచ్చేయరు. టాక్ బాగుంది అని తెలిస్తే మెల్లగా కుటుంబాలతో కదులుతారు. మహానటి విషయంలో జరిగింది ఇదే. కానీ సినిమా బాగుంటేనే అనే కండిషన్ వర్తిస్తుంది. శ్రీనివాస కళ్యాణం ఈ విషయంలో కనక మొదటిరోజు మెప్పించలేకపోతే చిక్కులు తప్పవు. నెగటివ్ టాక్ పోవాలి అంటే కంటెంట్ లో చాలా విషయం ఉండాలి. మరి శ్రీనివాసుడు ఏం చేస్తాడో చూడాలి.