నేను లోకల్.. అందరికీ ధమాకానే

Update: 2017-02-04 10:47 GMT
‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి.. గత ఏడాది ‘మజ్ను’ వరకు వరుసగా ఐదు హిట్లు కొట్టేశాడు నాని. ఇక మలయాళ భామ కీర్తి సురేష్.. గత ఏడాది ‘నేను శైలజ’ లాంటి సూపర్ హిట్ తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు త్రినాథరావు ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సూపర్ హిట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్ 150’ రూపంలో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి చివరగా తెలుగులో చేసిన ‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ అయింది. ఇక నిర్మాత దిల్ రాజు తాజాగా ‘శతమానం భవతి’ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

ఇంతమంది సక్సెస్ ఫుల్ వ్యక్తుల కలయికలో తెరకెక్కిన సినిమా ‘నేను లోకల్’పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. సినిమా ఆ అంచనాల్ని అందుకుంది. పైన చెప్పుకున్న వాళ్లందరి ఖాతాలోనూ ఇంకో సక్సెస్ ను జమ చేసింది. సక్సెస్ ఫుల్ నటీనటులు.. టెక్నీషియన్స్ కాంబినేషన్లో తెరకెక్కడం వల్ల విడుదలకు ముందే ఒక పాజిటివ్ బజ్ తెచ్చుకుంది ‘నేను లోకల్’. సినిమాకు టాక్ కూడా అలాగే వచ్చింది. దీంతో సినిమా అనుకున్న దాని కంటే పెద్ద హిట్టే అయ్యేలా కనిపిస్తోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో.. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్లు అంచనాల్ని మించి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఫస్ట్ డే కలెక్షన్ల మీద ఒక అంచనా రావచ్చు. అమెరికాలో ప్రిమియర్ షోలతోనే ఈ చిత్రం 1.61 లక్షల డాలర్లు.. అంటే కోటి రూపాయలు కలెక్ట్ చేయడం అనూహ్యమే. అక్కడ వారాంతం అయ్యేసరికే హాఫ్ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టేలా ఉంది. తొలి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.20 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News