ఈ కొత్త టీజరేదో బాగుందే..

Update: 2017-05-06 11:14 GMT
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘ప్రతినిధి’ సినిమా గుర్తుందా? తక్కువ బడ్జెట్లో రూపొంది.. పెద్దగా అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తమిళంలో ‘కో-2’ పేరుతో రీమేక్ కూడా అయింది. ఈ సినిమాకు కథ అందించిన ఆనంద్ రవి.. ఇప్పుడు దర్శక నిర్మాతగా మారాడు. అతను ‘నెపోలియన్’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడు కూడా అతనేనట. ‘నెపోలియన్’ కాన్సెప్ట్ మోషన్ టీజర్ రిలీజైంది. అది చూస్తే సినిమాపై క్యూరియాసిటీ పెరగడం ఖాయం. చాలా వెరైటీగా డిజైన్ చేశారు ఈ కాన్సెప్ట్ మోషన్ టీజర్.

కంట్రోల్ రూంలో నుంచి ఓ పోలీస్ అధికారికి ఫోన్ వెళ్తుంది. తన నీడ కనిపించకుండా పోయిందని ఒకడు కంప్లైంట్ చేశాడంటూ వివరిస్తాడు ఒక పోలీస్. నీడ కనిపించకపోవడమేంటంటయ్యా.. అంటాడు అవతలి అధికారి. నిజం సార్.. చెక్ చేశాను.. నిజంగా అతడి నీడ పడట్లేదు సార్ అంటాడా పోలీస్. నీడ పడట్లేదా.. ఎవడయ్యా వాడు అంటాడు అధికారి. అప్పుడు ‘నెపోలియన్’ టైటిల్ వస్తుంది. ఈ కాన్సెప్టుకు తగ్గట్లుగా దృశ్యం కూడా చూపించారు. ‘ది మ్యాన్ హు లాస్ట్ హిస్ షాడో’ అనే ట్యాగ్ లైన్ తో వస్తోందీ సినిమా. కాన్సెప్ట్ టీజర్ అయితే ఆకట్టుకునేలాగే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. త్వరలోనే ‘నెపోలియన్’ ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ చేస్తారట.


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News