సుశాంత్ సింగ్ మిస్టీరియస్ డెత్ అనంతర పరిణామాలు బలవన్మరణం వల్ల ప్రకంపనాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూస్తున్నాం. రెండు నెలలుగా ఈ కేసు విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు పోలీసులు. సీబీఐ ఎంట్రీతో సినిమా మరింతగా రక్తి కడుతోంది. ఈ సైనమాలో అసలు విలన్ ఎవరు? సుశాంత్ మరణం వెనక సూత్రధారి ఎవరు? అన్నది మాత్రం తేలడం లేదు.
ప్రస్తుతానికి అన్ని వేళ్లు రియా చక్రవర్తి వైపే చూపిస్తున్నాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుస ఆత్మహత్యలు రకరకాల సందేహాల్ని రైజ్ చేయడం వీటన్నిటి సీక్వెన్స్ పైనా సీబీఐ దర్యాప్తులో దృష్టి సారించడంతో బాలీవుడ్ అట్టుడుకుతోంది. డెత్ మిస్టరీ కారకుల్లో బిగ్ షాట్స్ ఎవరెవరు ఈ కేసులో బయటపడతారు? అన్నది సస్పెన్స్ గా మారింది.
రాజ్‌పుత్ మరణించే సమయంలో రియా చక్రవర్తి డ్రగ్ మాఫియా లింకుల వ్యవహారాలన్నిటినీ సీబీఐ నిగ్గు తేల్చే పనిలో పడింది. మాదకద్రవ్యాల దుర్వినియోగానికి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ దృష్టి సారించింది. సుశాంత్ కి ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని రియా కావాలనే ఇచ్చిందా? ఎందుకని ఇచ్చింది? అన్నది ఆరా తీస్తున్నారు.
సుశాంత్ రాజ్‌పుత్ రద్దీగా ఉన్న చోటికి వెళ్లాలంటేనే భయపడేవాడని దీనిని క్లాస్ట్రోఫోబియా అని అంటారని రియా చెబుతోంది. ఐరోపా పర్యటనలో సుశాంత్ విమానంలో కూర్చోవడానికి చాలా భయపడ్డాడని.. విమానం ఎక్కే ముందు అతను తన భయాన్ని తగ్గించుకోవడానికి మోడాఫినిల్ అనే టాబ్లెట్ ను తీసుకుంటానని చెప్పాడని తాను పేర్కొంది. అలాగే సుశాంత్ రోజూ ఆ మాత్రలను మింగేవాడని అతడు ఎక్కడికి వెళ్లినా తీసుకువెళతానని రియా తెలిపారు.
అయితే రియా తాజా మీడియా ఇంటర్వ్యూలో ఇలా వ్యాఖ్యానించగానే.. సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ తనని తిట్టేస్తూ సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోయారు. రియా చెబుతున్నవన్నీ అవాస్తవాలు అని.. సుశాంత్ అలా భయపడితే.. విమానాన్ని ఎలా నడిపించాడు? విమాన లైసెన్స్ పొందటానికి ఎందుకు ప్రయత్నించాడు? అంటూ ప్రశ్నించారు. నాసాకు వెళ్ళాలనే అతని ప్రణాళికను కూడా గుర్తు చేశారు నెటిజనులు. సుశాంత్ యొక్క మాజీ గాళ్ ఫ్రెండ్ అంకిత కాక్ పిట్ నుంచి నటుడి వీడియోను పంచుకుంది. అతను క్లాస్ట్రోఫోబిక్ అయితే ఇవన్నీ సాధ్యమేనా? అన్న ప్రశ్నను సుశాంత్ అభిమానులు సంధిస్తున్నారు. సుశాంత్ ఆలోచనలకు రియా చెబుతున్నదానికి ఎక్కడా పొంతన కుదరకపోవడంతో నెటిజనులు రియాను ఇష్ఠానుసారం ఆడేసుకుంటున్నారు.