ఈవీవీ లాంటి డైరెక్టర్ ను చూడలేదు!

Update: 2021-05-17 01:30 GMT
తెలుగు తెరపై హాస్యరసభరితమైన కథలను పరిగెత్తించిన దర్శకుల జాబితాలో 'వీరాభద్రమ్ చౌదరి' ఒకరుగా కనిపిస్తాడు. 'అహ నా పెళ్లంట' సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'అల్లరి' నరేశ్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. నాన్ స్టాప్ గా నవ్వించిన ఈ సినిమాతో వీరభద్రమ్ చౌదరికి మంచి మార్కులు పడిపోయాయి. ఆ తరువాత సునీల్ హీరోగా ఆయన చేసిన 'పూలరంగడు' కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కామెడీ కంటెంట్ ఉన్న సినిమాలను బాగా తీయగలడు అని అంతా చెప్పుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆదిసాయికుమార్ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. "నేను మీసాలు కూడా రాకముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటి నుంచి ఇండస్ట్రీని దగ్గరగా చూస్తూ .. దర్శకత్వ శాఖలో పనిచేస్తూ మెళకువలను నేర్చుకుంటూ వచ్చాను. ముందుగా నేను ఈవీవీ సత్యనారాయణగారి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాను.

ఈవీవీగారు మంచి మనిషి .. గొప్ప దర్శకులు .. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం ఆయన షూటింగు చేసేవారు. ఫలానా సమాయానికి ఫస్టు షాట్ కావాలి అంటే .. ఆ సమయానికి అది అయిపోయేదంతే. ఆయనలోని అంకితభావాన్ని .. పట్టుదలను నేను మరెక్కడా చూడలేదు. అప్పట్లోనే నేను 'అల్లరి' నరేశ్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నా మొదటి సినిమా అతనితోనే చేస్తానని నేను అప్పుడు అనుకోలేదు. అది కాకతాళీయంగా జరిగిపోయిందంతే" అని చెప్పుకొచ్చాడు.  
Tags:    

Similar News