కొత్త ఎప్పుడూ వింతే... సినిమాని ప్రేమించి సినిమా అంటే పడి చచ్చిపోయి, సినిమా రంగంలోనే సెటిల్ అవ్వాలని తపించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడంతో కొత్త వాళ్ళకి అవకాశాలు బాగానే వస్తున్నాయ్. సినిమానే దినచర్యగా మార్చుకుని దినదినాభివృద్ధి చెంది ఈ ఏడాది కొత్తగా మెరిసిన దర్శకుల జాబితా మీకోసం..
పటాస్ మీదున్న దర్శకుడు..
ఆగడు వంటి సినిమాకు స్క్రీన్ రైటర్ గా పని చేసి ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి. తొలిసినిమాతోనే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో హిట్ కొట్టాడు. 801, MRPF వంటి సీన్లు సినిమా స్థాయిని దర్శకుడి ప్రతిభను వెలికితీశాయి.
సుబ్రహ్మణ్యంని మనకు, తను పరిచయం చేసిన డైరెక్టర్
సాఫ్ట్ వేర్ ఉచ్చులో, ధనార్జన మోజులో పడి తనకంటూ వున్న జీవితాన్ని మరిచిపోయిన ఓ ఉద్యోగి తనని తను అన్వేషించుకుంటూ సాగే కధ ఎవడే సుబ్రహ్మణ్యం. కొత్త దర్శకుడు నాగ్ అశ్విన్ దూద్ కాశీ యాత్ర నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా చాలామంది మదిని తాకింది. ఫ్లాపుల ఉచ్చులో వున్న నానికి తిరిగి హిట్ అందించిన కీర్తి దర్శకుడికి చెందుతుంది.
సినిమా అంతటా చెరగని ఉత్కంఠ :
నారా రోహిత్ అంటేనే వైవిధ్యానికి ప్రతీక. అతను ఎంచుకునే చిత్రాలు సగటు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. పోలీస్ - గూన్ స్టైల్ లో ఆద్యంతం థ్రిల్లింగ్ మూమెంట్స్ తో సాగే సినిమా అసుర. తొలి ప్రయత్నంలోనే సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ ని అందించడంలో దర్శకుడు కృష్ణ విజయ్ సఫలమయ్యాడు.
జిల్ మనిపించి మెప్పించాడు:
గోపీచంద్ హీరోగా రాశీఖన్నా అందాలను కెమెరా ముందుకు తీసుకొస్తూ పక్కా మాస్ ఫార్ములాతో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన సినిమా జిల్. ఈ చిత్రంతో కొత్త విలన్ కబీర్ టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. యాక్షన్ పరంగా జిల్ సినిమా కొత్తపుంతలు తొక్కిందనే చెప్పాలి.
తొలి సినిమాతోనే గర్జించిన టైగర్:
హీరోయిన్ లేని సినిమాలు అనగానే మన హీరోలు ఒకడుగు వెనక్కి వేస్తారు. అయితే కధాబలం వుండాలేగానీ గ్లామర్ కి పెద్ద పీట అవసరం లేదని నిరువుపించిన చిత్రం టైగర్. సందీప్ కిషన్ హీరోగా వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా అందరినీ అలరించింది. స్నేహితుడు కోసం తపనపడే వ్యక్తి కధగా దర్శకుడు సినిమాను మలచినతీరు అభినందనీయం.
భలే మంచి దర్శకుడు :
ఇక ఈ జాబితాలో మరో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. కొత్త దర్శకుడి కెప్టెన్సీ లో సుదీర్ బాబు నటించిన భలే మంచి రోజు సినిమా మాత్రం మొదటి షో నుండి అందరినీ ఆకట్టుకుంటుంది. క్రైమ్ కామెడి తరహాలో సాగిన ఈ సినిమా ఆద్యంతం అలరించడమే కాక అనుకోని ట్విస్ట్ లతో ప్రేక్షకులను విస్మయపరిచింది.
వీరేకాక కొరియర్ బాయ్ కళ్యాణ్ తో ప్రేమ్ సాయి, సూర్య vs సూర్య తో కార్తిక్ ఘట్టమనేని వంటి యువ నయా దర్శకులు కూడా ఈ ఏడాదిలో తెరారంగ్రేటం చేసి మెప్పించారు.