హీరో సూర్యకి తమిళనాడు థియేటర్స్ యజమానుల సంఘానికి ఈ మధ్య కాస్త రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయనకు దాదాపు 30 మంది తమిళ నిర్మాతలు మద్దతుగా నిలిచారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద జ్యోతిక హీరోయిన్ గా సూర్య నిర్మించిన చిత్రం 'పోన్ మగల్ వందల్'. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఈ ప్రకటనతో తమిళ్ ఇండస్ట్రీలో వివాదం మొదలైంది. సూర్యను భయపెట్టేందుకు సూర్య నిర్మించే సినిమాల్ని ఇక తమ థియేటర్ ప్రదర్శించమని, నిషేధిస్తున్నామని యజమానులు ప్రకటించారు. పరిస్థితుల్ని బట్టి చిన్న సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనని 30మంది నిర్మాతలు సూర్యకు మద్దతు పలికారు. ఈ సినిమాని ఈ నెల 29వ తేదిన అమెజాన్ ప్రైమ్ టైమ్‌లో విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేసారు. ట్రైలర్ లో.. పిల్లల్ని హత్య చేసిన ఓ సైకో లేడీ కేసు విచారణ చుట్టూ కథ నడుస్తుంది. హీరోయిన్ ఓ న్యాయవాది.. ఆ సైకో లేడీ తరఫునే వాదిస్తుంది. ఆ సైకోకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో ఈ కేసు క్లోజ్ అయిపోయిందనే అంతా అనుకుంటారు. కానీ దీన్ని జ్యోతిక రీఓపెన్ చేయించి.. సైకో తరఫున వాదించేందుకు సిద్ధమవుతుంది. ఈ హత్యల తాలూకు బాధితులు జ్యోతికకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. తన పైకి చెప్పులు కూడా విసురుతారు. ఐతే ఈ కేసులో అసలు దోషులు వేరని.. వాళ్లను తప్పించేందుకు నేరం ఆ అమ్మాయి మీదికి నెట్టేశారని హీరోయిన్ భావిస్తుంది. మరి అందుకు ఆమె ఏం చేసింది.. ఎలాంటి సాక్ష్యాలు సేకరించింది. కోర్టులో ఎలా వాదించి అసలు దోషుల్ని ఎలా వెలుగులోకి తెచ్చింది అన్నది మిగతా కథ. అనేక ట్విస్టులతో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమా త్వరలో ఓటిటిలో విడుదల కానుండగా.. ప్రస్తుతం ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.