బాలీవుడ్ 'జెర్సీ'ని రిలీజ్ కష్టాలు వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. గత ఏడాదే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. సెకెండ్ వేవ్ తగ్గింది. పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని భావించారు. దీంతో డిసెంబర్లో మంచి రిలీజ్ తేదీని కూడా చూసుకున్నారు. కానీ థియేటర్ ఆక్యుపెన్సీ దగ్గర వెనక్కి తగ్గారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా రిలీజ్ చేస్తే వసూళ్లు వస్తాయా? అని సందేహించారు. అటుపై ఒక్కసారిగా థర్డ్ వేవ్ ఉవ్వెత్తున దూసుకొచ్చింది. మళ్లీ అన్ని బంద్ అయ్యే పరిస్థితులు. దీంతో ఏప్రిల్ వరకూ రిలీజ్ మాట ఎరుగని పరిస్థితి.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నా ఇప్పుడు పోటీ కారణంగా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్' హిందీలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుండటంతో అనూహ్యంగా మరోసారి 'జెర్సీ' వాయిదా పడింది. ఏప్రిల్ 14న రిలీజ్ అవ్వాల్సిన 'జెర్సీ' అదే నెల 22కి వాయిదా పడింది. మరి ఈ తేదీకైనా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందా? అంటే చెప్పడం కష్టమనే టాక్ వినిపిస్తుంది.
ఈసినిమాపై ఓ వ్యక్తి కోర్టులో కేసు ఫైల్ చేసాడు. తన కథని కాపీ కొట్టారంటూ రూపేష్ జైశ్వాల్ అనే రచయిత అరోపించాడు. 2007 లో తాను 'ది వాల్' పేరుతో ఓ కథ రాసి దాన్ని బౌండెడ్ స్ర్కిప్ట్ గా సిద్దం చేసానని.. ఇది ఓ యువకుడి చుట్టూ తిరుగుతుందని..పూర్తిగా క్రీడా నేపథ్యమున్న స్టోరీ అని.. అదే కథని 'జెర్సీ'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పిటీషన్ లో పేర్కొన్నాడు.
అయితే 'జెర్సీ' అన్నది తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి మూడేళ్ల క్రితం నాని హీరోగా తెరకెక్కించి రిలీజ్ చేసారు. అదే కథని అదే దర్శకుడు ఇప్పుడు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసారు. మరి అప్పుడు వేయని కేసు సదరు రైటర్ ఇప్పుడే ఎందుకు వేసినట్లు? అప్పుడు కాపీ కొట్టినట్లు అనిపించలేదా? లేక అప్పుడు కేసు వేస్తే ప్రయోజనం ఉండదని ఇప్పుడు సీన్ లోకి వచ్చాడా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి.
ఈ రచయిత హిందీ వాడు కాబట్టి హిందీ రీమేక్ రిలీజ్ సమయంలో కేసు వేస్తేనే ఏదైనా ప్రయోజనం ఉంటుందని భావించి ఇప్పుడు సీన్ లోకి వచ్చి ఉండొచ్చని అంటున్నారు. మరి ఈకేసు కోర్టులో నిలబడుతుందా? వీగిపోతుందా? అన్నది కొన్ని రోజుల్లోనే తేల్తుంది.
కోర్టు దీన్ని అత్యవసర విచారణ కేసుగా భావించి ఏప్రిల్ 22 కిముందే విచారించనుంది. అయితే ఇలాంటి కేసులు సినిమాలపై...పేరున్న దర్శకులపై సహజంగా పడుతుంటాయి. ఆ తర్వాత ఒక్కసారిగా కామ్ అప్ అయిపోతుంటాయి. 'జెర్సీ' రీమేక్ ని దిల్ రాజు- నాగవంశీ- అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.