కొన్ని వారాలుగా తన కొత్త గాళ్‌ఫ్రెండ్ కారణంగా వార్తలో ఉన్నాడు హృతిక్ రోషన్. హృతిక్ మళ్లీ ప్రేమలో పడ్డాడా, తన కొత్త గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడబోతున్నాడా అంటూ దేశమంతా ఒకటే చర్చ. దీని మీది నుంచి అందరి దృష్టినీ మళ్లించడానికా అన్నట్టు తన సినిమా అప్‌డేట్ ఒకదాన్ని వదిలాడు హృతిక్.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అయిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే మూవీ చేస్తున్నాడు హృతిక్. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమాని వచ్చే యేడు జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. కానీ ఇప్పుడు డేట్ మార్చారు. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 28కి షిఫ్ట్ చేశారు.
ఈ విషయాన్ని హృతిక్ స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనేది మాత్రం అతను చెప్పలేదు. పోయినేడు జూన్‌లోనే ఈ సినిమా షూటింగ్ మొదలైపోయింది. అయితే వేర్వేరు దేశాల్లో కొంత షూట్‌ని ప్లాన్ చేశారు. థర్డ్ వేవ్ కారణంగా దానికి ఆటంకం ఏర్పడింది.
ఆలస్యమయ్యింది. ఇప్పుడు కొవిడ్ ఎఫెక్ట్ దాదాపు తగ్గిపోయింది కాబట్టి ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వర్క్ కంటిన్యూ చేయబోతున్నారు. భారీ చిత్రం కావడం వల్ల కాస్త ఎక్కువ టైమే పడుతుంది కనుక రిలీజ్ ప్లాన్స్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
సిద్ధార్థ్ దర్శకత్వంలో ఇప్పటికే బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలు చేశాడు హృతిక్. ఆ రెండూ మంచి విజయం సాధించడంతో 'ఫైటర్' మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొనె నటించడం అడిషనల్ అట్రాక్షన్. వయాకామ్ 18, మార్ఫ్లిక్స్ సంస్థలు వందల కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు సమాచారం.