కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ అతి త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ఈ చిత్ర విడుదలకు మిగిలిందిక నెలన్నరే. ఈ నెలాఖరు కల్లా మహేష్ ఈ సినిమా నుంచి బయటికి వచ్చేస్తాడు. తాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎప్పుడో కమిటైన సినిమాను వచ్చే నెలలోనే మొదలుపెట్టబోతున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం వంశీ పైడిపల్లి సొంత కథతో తెరకెక్కుతున్న సినిమా కాదట. లోకల్ రైటర్లు కూడా ఎవరూ ఈ కథను రాయలేదట. న్యూజిలాండ్ లో తెరకెక్కిన ఒక టీవీ సిరీస్ ఆధారంగా ఈ చిత్ర కథను అల్లినట్లు సమాచారం.
క్రైం నేపథ్యంలో సాగే ఆ టీవీ సిరీస్ ఆధారంగా మన నేటివిటీగా తగ్గట్లుగా స్క్రిప్టును తీర్చిదిద్దారట. ఐతే ఇలా ఉచితంగా కాన్సెప్ట్ కాపీ కొట్టేస్తే చాలా ఇబ్బందులొస్తున్నాయి కాబట్టి అఫీషియల్ గానే రీమేక్ రైట్స్ కొని ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. వంశీ పైడిపల్లి గత సినిమా ‘ఊపిరి’ ఫ్రెంచ్ మూవీ ‘ఇన్ టచబుల్స్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ చిత్ర హక్కులు కొనే ఈ సినిమా చేశారు. మహేష్ సినిమా విషయంలోనూ అలాగే చేయనున్నాడట వంశీ. ‘అజ్ఞాతవాసి’ అనుభవాల నేపథ్యంలో వంశీ అండ్ టీం ఏమాత్రం రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఈ చిత్రాన్ని దిల్ రాజు-అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక.