కౌబాయ్ గా మారి తుపాకి ప‌ట్టిన నాని!

Update: 2022-04-05 06:53 GMT
నేచుర‌ల్ స్టార్ నాని గ‌త ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాల‌తో సూప‌ర్ హిట్ ల‌ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ట‌క్ జ‌గ‌దీష్` థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ త‌రువాత డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌లైన పీరియ‌డిక్ రొమాంటిక్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్‌` కూడా నాలుగు భాష‌ల్లో విడుద‌లై నాని కెరీర్ లోనే భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ లో వున్న హీరో నాని అదే జోష్ తో మ‌రో రెండు చిత్రాల‌ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు.

అందులో ఒక‌టి `అంటే సుంద‌రానికి`, మ‌రొక‌టి `ద‌స‌రా`. ఈ రెండు చిత్రాల్లో యంగ్ డైరెక్ట‌ర్ వివేక్ ఆత్రేయ తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ కామెడీ `అంటే సుంద‌రానికి`  చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. మ‌ల‌యాళ న‌టి న‌జ్రియా నజీయ్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

విభిన్న‌మైన క‌థా, క‌థ‌నాల‌తో రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాన్తంగా జూన్ 10న విడుద‌ల కాబోతోంది. రిలీజ్ కి రెండు నెల‌లు స‌మ‌యం వుండ‌టంతో చిత్ర బృందం ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది. ఇటీవ‌ల హీరోయిన్ ఫ‌స్ట్ లుక్ వీడియోని విడుద‌ల చేసిన చిత్ర బృందం ఈ బుధ‌వారం ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ని విడుద‌ల చేయ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ప్రోమోని మంగ‌ళ‌వారం రిలీజ్ చేసింది. ప్ర‌మోలో పంచ‌క‌ట్టి నాని చేసిన హంగామా ఆక‌ట్టుకుంటోంది. అంతే కాకుండా ప్రోమో చివ‌ర్లో కౌబాయ్ గెట‌ప్ లో నాని తుపాకి ప‌ట్టి హ‌ల్ చ‌ల్ చేయ‌డం విశేషం.

ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ గా `పంచ‌క‌ట్టు ..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని బుధ‌వారం సాయంత్రం 6 :03 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతోంది. వివేక్ సాగ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ పాట‌కు హ‌సిత్ గోలి సాహిత్యం అందించారు. ప‌ద్మ‌శ్రీ అరుణ సాయిరామ్ ఈ పాట‌ని ఆల‌పించారు. `ఏంటి సార్ ఓకేనా... ఏంటి మ‌రీ.. రంగంలో దూకారు ఇక సుంద‌రు మాస్టారూ...` అంటూ సాగే ఈ లిరికల్ వీడియో ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట ఆక‌ట్టుకుంటోంటి. సుంద‌రం మాస్టారు గా పంచ‌క‌ట్టి ఫారిన్ వీధుల్లో హీర‌నో నాని చేసే హంగామా నేప‌థ్యంలో ఈ పాట‌ని చిత్రీక‌రించారు.

వివ‌వేక్ సాగ‌ర్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఆక‌ట్టుకుంటూనే న‌వ్వులు కురిపించేలా వుంది. యుఎస్ లోని సుంద‌రమైన లొకేష‌న్ ల‌ని ఆస్వాదిస్తూ కారు డోర్ లోంచి త‌ల బ‌య‌టికి పెట్టి ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తూ నాని చేసే హంగామా ప్ర‌ధానంగా ఈ పాట సాగ‌నుంది. న‌దియా, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సుహాస్‌, న‌రేష్‌, అళ‌గం పెరుమాల్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, రోహిణి, పృథ్వీరాజ్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ ర‌వితేజ గిర‌కిజాల‌, నికేత్ బొమ్మి ఛాయాగ్ర‌హ‌ణం అందించారు. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈచిత్రం జాఊన్ 10న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కానుంది.


Full View
Tags:    

Similar News