దగ్గుబాటి రానా, సాయి పల్లవి కలిసి నటించిన యాక్షన్ డ్రామా 'విరాటపర్వం'. వేణు ఊడుగుల అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కించారు. నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈమూవీ గత ఏడాది కాలంగా రిలీజ్ విషయంలో అవరోధాల్ని ఎదుర్కొంటూ ఎట్టకేలకు ఈ జూన్ 17 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎల్.ఎల్. వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
దీనికి తోడు రిలీజ్ కి ముందు సినిమాకు చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించింది. సాయి సల్లవి పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చింది. తను ఓ మీడియాతో మాట్లాడిన మాటలు వివాదాస్పదం కావడం, సాయి పల్లవిపై భజరంగదళ్ నాయకులు సెన్సార్ బోర్డ్ తో పాటు, సినిమా రిలీజ్ ని ఆపాలంటూ పోలీసులని కూడా ఆశ్రయించడం, సాయి పల్లవి కశ్మీరి పండిట్ల హత్యలు, గో హత్యలు సమానమేని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు, నటి విజయశాంతి కూడా ఘాటుగా స్పందించడంతో 'విరాటపర్వం' ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.
దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలైన ఈ మూవీ కి మంచి రెస్పాన్స్ లభహించింది. విమర్శకులు పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడంతో ఈ మూవీపై అందరి దృష్టిపడింది.
అంతా పాజిటివ్ గా వున్నా సినిమా మాత్రం టార్గెట్ చేసిన బీ, సీ సెంటర్లలో ఫుల్స్ కాలేకపోవడం గమనార్హం. నక్సల్స్ నేపథ్యంలో తీసిన సీరియస్ డ్రామా కావడం వల్లే దీనికి బీ, సీ సెంటర్లలో థియేటర్స్ ఫుల్స్ కావడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ ఈ మూవీకి అగ్నిపరీక్షగా మారబోతోందా? అంటే ట్రేడ్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. పేరుకి రానా హీరో అయినా ముందు నుంచి దర్శకుడు వేణు ఊడుగుల ఇది సాయి పల్లవి సినిమా అంటూ చచెబుతూ వస్తున్నారు. ఒక విధంగా ఆయన మాటల్లో చెప్పాలంటే ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అలాంటప్పుడు ఈ మూవీ ఫలితం సాయి పల్లవి కి అగ్ని పరీక్షగా మారిందని చెప్పక తప్పదు.
ఈ అగ్ని పరీక్ష నుంచి సాయి పల్లవి , రానా నటించిన 'విరాటపర్వం' గట్టెక్కి భారీ వసూళ్లని రాబడుతుందా? బీ, సీ సెంటర్లలో థియేటర్స్ ని హౌస్ ఫుల్స్ చేస్తుందా? అన్నది తెలియాలంటే రి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఈ మూవీలోని ఇతర కీలక పాత్రల్లో ప్రియమణి, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్, నందితా దాస్ తదితరులు నటించారు.