సౌత్ సినిమాలు ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈమద్య కాలంలో సౌత్ సినిమాలు ఉత్తరాదిన వందల కోట్ల వసూళ్లను రాబట్టడం జరుగుతుంది. సౌత్ సినిమాల డబ్బింగ్ వర్షన్ లు లేదా రీమేక్ లు మాత్రమే ఈమద్య కాలంలో బాలీవుడ్ లో మంచి ఆధరణ దక్కించుకుంటున్నాయి. 60 శాతం సక్సెస్ సినిమాలను తీసుకుంటే సౌత్ సినిమాల రీమేక్ లేదా డబ్బింగ్ సినిమాలు ఉంటున్నాయి అనేది బాలీవుడ్ వర్గాల టాక్.
ఆ విషయం నిజమే అన్నట్లుగా ఇటీవల సల్మాన్ ఖాన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ సౌత్ సినిమాలు ఎందుకు నార్త్ లో ఎక్కువగా ఆడుతున్నాయి.. అదే మన సినిమాలు సౌత్ లో ఆడటం లేదు అనేది ఆయన అనుమానం. సౌత్ సినిమాలు నార్త్ లో వందల కోట్లు వసూళ్లు సాధిస్తున్నాయి. కాని నార్త్ సినిమాలు మాత్రం సౌత్ లో ఎందుకు వందల కోట్ల వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి అంటూ ఆయన ప్రశ్నించాడు.
ఇదే సమయంలో ఆయన ఇంకా మాట్లాడుతూ.. బాలీవుడ్ లో హీరోయిజం ను ఎలివేట్ చూపించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారు హీరో ను ఓ స్టార్ గా చూపించకుండా సాదా సీదాగా చూపించడం తో ఎక్కువగా మాస్ ఆడియన్స్ కు రీచ్ అవ్వలేక హిందీ సినిమాలు ఢీలా పడుతున్నాయి అనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఆ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
సల్మాన్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యి వందల కోట్ల వసూళ్లు దక్కించుకున్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం సినిమాలు నార్త్ ఫిల్మ్ మేకర్స్ తెరకెక్కించారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కొందరు బాలీవుడ్ సినీ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ సినిమాలపై అభిమానం ఉంటే అక్కడ నటించుకోవచ్చు.. కాని తనను స్టార్ గా నిలిపిన బాలీవుడ్ ను అవమానించినట్లుగా మాట్లాడవద్దు అంటూ కొందరు బాలీవుడ్ ప్రేక్షకులు సల్మాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ మొదటి సారి తెలుగు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరంజీవి హీరోగా మెహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న లూసీఫర్ రీమేక్ మూవీ గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ కీలకమైన గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇటీవలే ముంబై వెళ్లి మరీ చిరంజీవి ఇతర యూనిట్ సభ్యులు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఆయన తో షూటింగ్ చేసుకుని వచ్చారు.