మెగా హీరోతోనే కాదు.. ఆమెకు ఎన్టీఆర్ తో కూడా!

Update: 2021-10-29 04:08 GMT
రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన పెళ్లిసందD సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా చాలా అంచనాలను మోసుకు వచ్చింది. కాని సినిమా కాస్త బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. భారీ అంచనాల నడుమ రూపొందిన పెళ్లిసందD సినిమా ప్లాప్ టాక్ దక్కించుకున్నా వసూళ్లు కొంత మేరకు దక్కించుకున్నాయి. అలాగే పెళ్లిసందD సినిమా నిరాశ పర్చినా కూడా హీరోయిన్‌ శ్రీలీల జోరు మాత్రం మామూలుగా లేదు. ఇప్పటికే రవితేజ సినిమా కు హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా లో హీరోయిన్ గా శ్రీలీల కన్ఫర్మ్‌ అంటూ చాలా బలంగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాతో పాటు ఒక మెగా హీరో సినిమాలో కూడా హీరోయిన్‌ గా ఈమెను తీసుకునేందుకు చర్చలు జరిపారనే వార్తలు వారం రోజుల క్రితం వచ్చాయి. ఆ మెగా హీరో మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతుందని కూడా ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నందమూరి హీరో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీలీల అంటూ వార్తలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా శ్రీలీల పేరు టాలీవుడ్‌ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. అందంతో పాటు చక్కని నటన ప్రతిభ మరియు డాన్స్‌ లు చక్కగా చేస్తున్న శ్రీలీలకు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అంటూ చాలా మంది స్టార్స్ భావిస్తున్నారట. అందులో భాగంగానే కొరటాల శివ అండ్‌ టీమ్ కూడా ఆమెను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ తో కొరటాల శివ చేయబోతున్న సినిమా కోసం బాలీవుడ్‌ హీరోయిన్స్ ఆలియా భట్‌.. కియారా అద్వానీలతో పాటు అనన్య పాండే వరకు పలువురిని పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆలియా భట్‌ కు భారీ పారితోషికం ఇచ్చి ఆమెను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఆమద్య ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఆమెను కన్ఫర్మ్‌ చేయలేదు. ఇప్పడు శ్రీలీల పేరు పరిశీలనకు వచ్చిందట.

కోట్లు ఖర్చు పెట్టి బాలీవుడ్‌ ముద్దుగుమ్మను తీసుకు రావడానికి బదులుగా కోటి లోపు పారితోషికంతో శ్రీలీల ను ఎన్టీఆర్‌ కు జోడీగా నటింపజేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారట. ఈ విషయం లో తుది నిర్ణయం ఎన్టీఆర్‌ మరియు కొరటాల శివ తీసుకోవాల్సి ఉంది. ఎన్టీఆర్‌ మరియు శ్రీలీల జోడీ ఖచ్చితంగా బాగుంటుందని అభిమానులు అప్పుడే చర్చ మొదలు పెట్టేశారు. కాని పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమాను విడుదల చేయాలి అంటే ఖచ్చితంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌.. కొరటాల శివల మూవీ హీరోయిన్‌ గా శ్రీలీలను ఎంపిక చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆచార్య పనుల్లో బిజీగా ఉన్న కొరటాల శివ కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎన్టీఆర్‌ విదేశీ టూర్‌ కు వెళ్లబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ కు జోడీగా నటించేది ఎవరు అనేది డిసెంబర్‌ లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక వేళ ఎన్టీఆర్‌ కు జోడీగా కనుక శ్రీలీలకు అవకాశం దక్కితే ఆమె కెరీర్‌ టర్న్‌ అయినట్లే. ఎన్టీఆర్‌ తర్వాత వరుసగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావడం మొదలు అవుతాయి. అందుకే శ్రీలీలకు కనుక ఎన్టీఆర్‌ తో ఛాన్స్ వస్తే నూటికి నూరు పాళ్లు ఆమె అదృష్టవంతురాలు అనడంలో సందేహం లేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే శ్రీలీల వచ్చే ఏడాది రవితేజ సినిమా తో పాటు మెగా మూవీ మరియు నందమూరి మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్నమాట.




Tags:    

Similar News