టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. క్రికెటర్ షోయబ్ మాలిక్ ని పెళ్లాడక ముందు సానియా కొన్నాళ్ల పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో డేటింగ్ చేసిందన్న గుసగుసలు వినిపించాయి. అయితే సానియా పై మనసు పడిన యువహీరోల జాబితాలో షాహిద్ తో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి.
ఇందులో ఇప్పుడు ఒక ట్యాలెంటెడ్ యువహీరో తనకు తానుగానే బయటపడ్డాడు. అతడు తన మనసులో సానియాపై ఉన్న ఫీలింగ్ ని బహిరంగంగా వెల్లడించాడు. టెన్నిస్ స్టార్ పై తనకు విపరీతమైన ప్రేమ ఉండేదని.. అయితే ఆమె తల్లి తనను తిట్టిందని వరుణ్ ధావన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వరుణ్ ఒక నిర్మాణ సంస్థతో కలిసి ఒక యాడ్ కోసం పనిచేస్తున్న సమయంలో ఘటన అది.
``నేను మ్యాడ్ ప్రొడక్షన్స్- ముకుల్ ఆనంద్ బృందంతో ఓ వాణిజ్య ప్రకటన కోసం పని చేస్తున్నాను. సానియా మీర్జాతో కలిసి యాడ్ లో నటించాలి. అప్పటికే సానియా పై నాకు చాలా క్రష్ ఉంది. ఆమె నన్ను ఒక యాపిల్ అడిగారు. మార్కెట్లో కొని తెచ్చాను. నేను ఆమెకు వణుకుతూ ఇస్తున్నాను.. ``ఆంటీ... యాపిల్`` అని అన్నాను. ఇంతలోనే సానియా అమ్మ గారు నా ముఖం పగులగొడుతుందేమో అని భయపడ్డాను. ఈ యాపిల్ తీసుకురావాలని నీకు ఎవరు చెప్పారు? అని ఆమె అడిగింది. అదృష్టవశాత్తూ సానియా వచ్చి నాకు యాపిల్ కావాలి అని చెప్పింది`` అని నాటి దృష్టాంతాన్ని వరుణ్ గుర్తు చేసుకున్నాడు.
``ప్రకటనలో నటించేందుకు 300 బూట్లు కావాలి. నేను లింకింగ్ రోడ్ కి వెళ్లి ఆ బూట్లు అద్దెకు తీసుకున్నాను. షూస్ తీసుకోవడానికి నాకు రూ.5000 చేతికి వచ్చింది. దానిలో మినహాయించుకునే సానియా కోసం యాపిల్ కూడా కొన్నాను`` అని గుర్తు చేసుకున్నాడు ధావన్ బోయ్.
ప్రస్తుతం వరుణ్ నటించిన `భేదియా` ప్రమోషన్స్ పరంగా స్వింగ్ లో ఉంది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో మాడాక్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హారర్ కామెడీ విశ్వం నుండి వచ్చిన తొలి చిత్రమిది.
భేదియాలో కృతి సనన్- అభిషేక్ బెనర్జీ- దీపక్ డోబ్రియాల్ తదితరులు నటించారు. నవంబర్ 25న హిందీ- తెలుగు- తమిళ భాషల్లో థియేట్రికల్ గా విడుదల కానుంది.
ఇటీవల గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వరుణ్ ధావన్ ప్రదర్శన ఇచ్చాడు. నవంబర్ 28 వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో `భేదియా` కూడా ప్రదర్శితం కానుంది. ఈ చిత్రంతో పాటు వరుణ్ తదుపరి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నితేష్ తివారీ `బవాల్` చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. ఇటీవల సీనియర్ నటుడు అనిల్ కపూర్- కియారా అద్వానీ- నీతూ కపూర్ లతో కలిసి జగ్‌జగ్ జీయోలో వరుణ్ ధావన్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.