ఆ రెండు న్యూస్ పేపర్లూ షాకిచ్చాయి

Update: 2016-07-04 07:42 GMT
మామూలుగా టాలీవుడ్‌ లో పెద్దగా షాకింగ్‌ న్యూసులు ఏమీ ఉండవు. ఏమన్నా ఉన్నాయి అంటే.. అది డైరక్టుగా సదరు సెలబ్రిటీల నుండే సోషల్‌ మాధ్యమాల ద్వారా బయటకు వచ్చేస్తోంది. కాని ఇలాంటి పరిస్థితుల్లో కూడా.. ఒక రెండు న్యూస్ పేపర్లు మాత్రం అందరికీ షాకిచ్చాయి.

నిన్న ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక.. ఏకంగా తమ ఫ్రంట్‌ పేజ్ లో.. పైన టైటిల్‌ డిజైన ప్రక్కనే ఒక బ్యానర్ ఐటెం వేశారు. ఒక ప్రముఖ హీరో.. అలాగే ఒక ప్రముఖ హీరోయిన్‌.. డిసెంబర్‌ 2016లో పెళ్ళి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఒకవేళ ఇది రూమర్ అయ్యుంటే ఫిలిం వార్తల పేజీలో వేసుంటే సరిపోయేది.. కాని ఆ పేపర్ ఎప్పుడైతే ఫ్రంట్‌ పేజీలో ఓపెన్ గా వేసిందో.. అప్పుడు ఈ పెళ్లి నిజమే అనే సందేహం ఎవరికైనా వస్తుంది.

మరో ఇంగ్లీష్‌ పత్రిక ఏమీ తక్కువ తినలేదు. ఒక స్టార్‌ ఫ్యామిలీకి చెందిన నట వారసుడు.. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురును డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్ రాగానే.. ఈ పత్రిక ఏకంగా సదరు అమ్మాయి పేరును తెలుసుకుని.. ఒక ఫోటోతో సహా వార్తను రాసేశారు. దేశవ్యాప్తంగా పేరున్న పత్రిక ఇలా రాసేసిందంటే.. అది రూమర్ అని ఎవ్వరూ అనుకోరు.

ఆ విధంగా ఈ రెండు పత్రికలూ షాకిచ్చినా కూడా.. అసలు సదరు రూమర్/న్యూస్ లో భాగమైన ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటిని ఖండించకపోవడం విశేషం. అంటే రాసినవన్నీ నిజాలే అనుకోవాలా??
Tags:    

Similar News