ఫోటో స్టొరీ: ఒంపుసొంపుల నిధి

Update: 2018-09-11 06:40 GMT
నిధి అగర్వాల్ నటించిన తెలుగు సినిమా ఇంకా ఏదీ రిలీజ్ కాలేదు గానీ తెలుగు యూత్ కు పరిచయమైన పేరే.  నాగ చైతన్య సినిమా 'సవ్యసాచి' లో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ ఎంట్రీ కి ముందే రెండో సినిమాను అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ తో సైన్ చేసింది.  వెంకీ అట్లూరి-అఖిల్ సినిమానే నిధి రెండో సినిమా.  సినిమాలలో నటించడంతో పాటుగా నిధి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇన్స్టాగ్రామ్ లో నిధి కి 2 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు అంటే మనం తన పాపులారిటీ అర్థం చేసుకోవచ్చు.  తాజాగా నిధి ఒక ఫోటో ను అప్లోడ్ చేసింది.  వైట్ కలర్ షర్ట్ వేసుకున్న నిధి పై బటన్స్ పెట్టుకోకుండా క్లీవేజ్ అందాలతో నెటిజనులను ఊరించింది. లూజ్ హెయిర్.. వీలైనంత తక్కువ మేకప్ తో కనిపించింది.  సన్నగా ఉన్న గాజులాంటి చెవి రింగ్.. చేతివేలికి ఉంగరం మాత్రం పెట్టుకుంది. ఇక గడ్డం కింద చెయ్యి పెట్టుకుని  రాకుమారిలా ఏదో అలోచిస్తున్నట్టు ఓ పోజిచ్చింది.

ఇంతకీ ఈ ఫోటో కి ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఏంటంటే "ఓ వెయ్యి సూర్యుళ్ళు నన్ను మోస్తారు".  ఇక నెటిజనులు వాళ్ళ స్టైల్ లో సరదా కామెంట్లు పెట్టారు. ఒకరు 'వెయ్యి సూర్యుళ్ళు మోసినా నువ్వే సన్ షైన్" అని కామెంట్ చేస్తే మరొకరు "సన్ కంటే హాట్ గా ఉన్నావు' అన్నారు.   ఒక కొంటె కోణంగి మాత్రం "వెయ్యి సూర్యుళ్ళు సరే వెయ్యి క్లీవేజ్ లు వద్దా?" అని అడిగాడు.  


Tags:    

Similar News