సినిమాలో కంటెంట్ ఉంటే ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తుంటాయి కొన్ని సినిమాలు. పోయినేడాది చివర్లో నిఖిల్ సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డీమానిటైజేషన్ దెబ్బను తట్టుకుని అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు ఈ యువ కథానాయకుడి కొత్త సినిమా ‘కేశవ’.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూపంలో ఉన్న అడ్డంకిని అధిగమించింది. ‘బాహుబలి-2’ దెబ్బకు ఆ తర్వాత వచ్చిన కొత్త సినిమాలన్నీ అల్లాడిపోతున్న టైంలో ‘కేశవ’ దానికి ఎదురొడ్డి నిలిచాడు. ఈ సినిమాకు అనూహ్యమైన ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్యాక్డ్ హౌసెస్ తో మొదలైంది.
మల్టీప్లెక్సుల.. సింగిల్ స్క్రీన్లు అని లేకుండా తొలి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆక్యుపెన్సీ విషయంలో అంచనాల్ని మించి పోయింది ‘కేశవ’. ఓవర్సీస్ లో కూడా ‘కేశవ’కు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. సినిమాకు టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం కలిసొచ్చే అంశమే. కథ వీక్ అని.. ద్వితీయార్ధంలో బిగి తగ్గిందని కొంచెం నెగెటివ్ గా కూడా మాట్లాడుతున్నప్పటికీ.. ఒక్కసారి చూడటానికైతే ఢోకా లేదని.. ఆమేరకు గిట్టుబాటయ్యే అంశాలు చాలానే ఉన్నాయని అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా వరకు పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. సుధీర్ వర్మ ఈజ్ బ్యాక్ అని.. నిఖిల్ మరోసారి ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టాడని జనాలు పొగిడేస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసిన నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్లోనే ‘కేశవ’ బ్రేక్ ఈవెన్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/