కిస్సు పెట్ట‌న‌ని మ‌ద‌ర్ ప్రామిస్ చేశాడు

Update: 2015-12-15 05:58 GMT
ఆన్ స్క్రీన్ కిస్సుల‌కు ఛాన్సులొస్తే ఏ హీరో అయినా వ‌దిలి పెట్టేస్తాడా? అస‌లే మ‌న హీరోలంతా ర‌శిక‌ర‌జాలు. హీరోయిన్‌ తో ముద్దు ముచ్చ‌టకు ఛాన్సొస్తే ఎందుకు వ‌దిలిపెట్టేస్తారు? మ‌న స్టార్ హీరోల్లో మ‌హేష్‌ - ప‌వ‌న్‌ - అల్లు అర్జున్‌ - న‌వ‌దీప్ .. ముద్దులు పెట్టేయ‌డంలో య‌మ స్పీడ్‌ మీద ఉంటార‌న్న‌ది తెలిసిందే. బాలీవుడ్‌ లో అయితే ప్ర‌తిహీరో ఓ సీరియ‌ల్ కిస్స‌రే. అక్క‌డ ఇమ్రాన్ హ‌స్మిని డామినేట్ చేసేలా నేటి త‌రం హీరోలు కూడా ముద్దుల్లో మారాజాలుగా పాపుల‌ర్ అయిపోతున్నారు. క‌మ‌ల్‌ హాస‌న్‌ - అమీర్‌ ఖాన్ లాంటి హీరోలు అయితే ముద్దులు లేనిదే అస‌లు సినిమాలే తీయ‌రు. క‌మ‌ల్‌ హాస‌న్ లేటు వ‌య‌సులో ఘాటు కిస్సులు అన్న‌ట్టు చీక‌టిరాజ్యం లో ఇద్ద‌రు హీరోయిన్ల‌తో లిప్‌ లాక్ వేసేశాడు.

అయితే అస్స‌లు కిస్సు అనేదే పెట్ట‌ని హీరో ఎవ‌రైనా ఉన్నారా? అని వెతికితే .. వెత‌క‌పోయిన తీగ కాలికి త‌గిలిన‌ట్టే నిఖిల్ త‌గిలాడు. ఈ హీరో వ‌రుస‌గా విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టిస్తూ కెరీర్‌ ని సాగిస్తున్నాడు. హ్యాపీడేస్ నుంచి ఇన్నేళ్ల కెరీర్‌ లో అత‌డు ఒక్క హీరోయిన్‌ తోనూ  లిప్‌ లాక్ అన్న‌దే వేయ‌లేదు. అలా ఎందుకు చేస్తున్నాడు? అని ఆరాతీస్తే ఆస‌క్తి క‌లిగించే మ్యాట‌ర్ ఒక‌టి తెలిసింది.  నిఖిల్ ఓ ట్రెడిష‌న‌ల్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చాడు. పైగా అస్స‌లు హీరోయిన్ల‌తో లిప్‌ లాక్ అన్న‌దే వేయ‌న‌ని మ‌ద‌ర్ ప్రామిస్ చేశాడు. త‌న త‌ల్లికి ఇచ్చిన మాట ప్ర‌కారం అత‌డు ముద్దుల‌కు ముందే నో చెప్పేస్తాడు. ఆ సంగ‌తిని అత‌డి స్నేహితులు - స‌న్నిహితులు కూడా చెబుతారు. ఎనీవే.. నిఖిల్ క‌మిట్‌ మెంట్‌ కి హ్యాట్సాఫ్.
Tags:    

Similar News