శంకరాభరణం వెనక్కి వెళ్లింది

Update: 2015-11-02 15:37 GMT
నిఖిల్ నందిత జంటగా నటించిన శంకరాభరణం.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 4న శంకరాభరణం రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత కం రైటర్ కోన వెంకట్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి కోన ఇలా అనౌన్స్ చేయడానికి 24గంటల ముందు.. నవంబర్ 20న రిలీజ్ అంటూ హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు. రిలీజ్ పోస్టర్లు రెడీ అవుతున్నాయని కూడా చెప్పాడు.

అయితే 'శంకరాభరణంం డిసెంబర్ 4 రిలీజ్ చేయబోతున్నామని, అఖిల్ కి గ్రాండ్ వెల్ కం చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని' ట్విట్టర్ లో ప్రకటించాడు కోన. దీంతో దీపావళికి వస్తున్న అఖిల్ కి రెండు వారాల పాటు కాంపిటీషన్ లేనట్లే అని చెప్పుకోవాలి.

ఒకవైపు అఖిల్ కు స్పేస్ ఇస్తూనే.. మరోవైపు తమ చిత్రానికి కూడా శంకరాభరణం టీం సేఫ్టీ జోన్ చూసుకున్నారని అర్ధమవుతోంది. నవంబర్ 11న అఖిల్ వస్తుండగా.. 27న బెంగాల్ టైగర్ రిలీజ్ అవుతోంది. మధ్యలో వచ్చి కలెక్షన్లలో వాటా కంటే.. వీటి స్పీడ్ తగ్గాక సోలో రిలీజ్ తో సందడి చేయచ్చని కోన అండ్ టీం డిసైడైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీ ఔట్ పుట్ పై మంచి సంతృప్తిగా ఉన్నారు యూనిట్. అందుకే ధైర్యంగా రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News