యంగ్ హీరో నితిన్ - బ్యూటీ సమంతలతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అఆలు దిద్దిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరిపేసుకుని, ఫిబ్రవరినాటికి తెరపైకి వచ్చేసే కాన్సెప్టుతో ఈ సినిమాని స్టార్ట్ చేశారు. ఇప్పుడీ అ..ఆ.. బడ్జెట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. అంచనాలను మించి ఖర్చయిపోయింతుడడంతో.. రిజల్ట్ పై అప్పుడే టెన్షన్ మొదలైపోయిందంటున్నారు. సాధారణంగా స్టార్ హీరోలతో తప్ప సినిమా చేయని త్రివిక్రమ్.. తొలిసారిగా ఓ మెట్టు కిందకు దిగి నితిన్ తో చేస్తున్నాడు. వాళ్లెవరకూ అప్పటికప్పుడు డేట్స్ ఇచ్చే పొజిషన్ లేకపోవడమే దీనికి కారణం.
అయితే.. త్రివిక్రమ్ చిన్న హీరోతో చేస్తున్నాడు కాబట్టి ఇదేదో లోబడ్జెట్ అనుకోవడానికి లేదు. అసలు ఈ సినిమాని స్టార్ట్ చేసినపుడు 35 కోట్ల బడ్జెట్ అనుకున్నారట. కానీ ఆ మార్క్ ఎప్పుడో దాటిపోయారని సమాచారం. ఇప్పటికి 45 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇంకా 30శాతం షూటింగ్ పెండింగ్ ఉండడంతో.. అఆ కంప్లీట్ అయ్యేసరికి మరి 10 కోట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే కేవలం నిర్మాణానికే 55 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందన్నమాట. ప్రింట్లు - ప్రమోషన్ లాంటి లెక్కలన్నీ వేసుకుంటే.. థియేటర్స్ లోకి వచ్చేసరికి ఈ సినిమాపై 60 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
మరి నితిన్ కి ఇంత మొత్తం వసూలు చేసే సత్తా ఉందా అంటే.. కష్టమే అనాలి. ఎందుకంటే నితిన్ రేంజ్ ఇప్పుడు పాతిక కోట్లు. ఇది సేఫ్ జోన్. త్రివిక్రమ్ తీసిన ప్రతీ సినిమా యాభైల్లోకి వచ్చేస్తుంది కాబట్టి.. అంతవరకూ వేసుకున్నా ఓకే. కానీ అరవై దాటి వసూలు చేయడమంటే.. సాధారణ విషయం కాదు. అలాగని త్రివిక్రమ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ మూవీని గట్టెక్కించే బాధ్యతను ఇప్పుడు త్రివిక్రమ్ ఒక్కడే మోయాల్సి ఉంటుంది.