ఎప్పుడూ ఆ ప్రేమకథలేనా సామీ??

Update: 2015-08-25 18:27 GMT
ఇష్క్‌, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్‌ ఎటాక్‌, చిన్నదాన నీకోసం .. ఈ సినిమాలన్నిట్లో కామన్‌ పాయింట్‌ 'లవ్‌ స్టోరి'. ఇవన్నీ ప్రేమకథలతో తెరకెక్కిన సినిమాలు. చిన్నదాన నీకోసం మినహా మిగిలిన సినిమాలన్నీ హిట్లు. ఇష్క్‌ సినిమాలో లవ్‌ కాన్సెప్టుతో పాటు స్క్రీన్‌ ప్లేని కొత్తగా ట్రై చేసి హిట్‌ కొట్టారు. గుండె జారి గల్లంతయ్యిందేలో లవ్‌ తో పాటు కన్ఫ్యూజన్‌ అనే పాయింటును హైలైట్‌ చేసి హిట్‌ కొట్టారు. హార్ట్‌ ఎటాక్‌ పూరీ మార్క్‌ లవ్‌ స్టోరి. అయితే ప్రతిసారీ ప్రేమకథల్లోనే నితిన్‌ ని చూసిన జనాలు పరమ రొటీన్‌ 'చిన్నదాన నీకోసం' చిత్రాన్ని తిరస్కరించారు. ప్రతిసారీ లవ్‌ స్టోరీస్‌ ని భరించలేమని చెప్పారు.

అందుకే ఇప్పుడు అదే క్యూలో వస్తున్న కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌ హిట్‌ కొట్టేందుకు ఆస్కారం ఉందా? లేదా? అన్న డిష్కసన్‌ సాగుతోంది. రొటీన్‌ ప్రేమకథలో నితిన్‌ కనిపించినా ఈ సినిమాలో కొత్త పాయింట్‌ ఏంటి? స్క్రీన్‌ ప్లేలో వైవిధ్యం ఉంటుందా? ఉండదా? నితిన్‌ క్యారెక్టరైజేషన్‌ లో కొత్తదనం ఎలా ఉంటుంది? అన్న చర్చ సాగుతోంది. గౌతమ్‌ మీనన్‌ శిష్యుడు ప్రేమ్‌ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయినా ప్రతిసారీ ప్రేమకథలేంటయ్యా నితిన్‌? రూటు మార్చి కొత్తగా ట్రై చేయవూ?
Tags:    

Similar News