మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత నితిన్ స్టామినాపై ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నితిన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో లై సినిమా తీస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేం హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మేజర్ పార్ట్ అమెరికాలోనే షూటింగ్ చేశారు.
లై సిినిమా షూటింగ్ నిమిత్తం ఆ చిత్ర యూనిట్ 75 రోజులుగా అమెరికాలోనే ఉండిపోయింది. రెండున్నర నెలలు నిర్విరామంగా పనిచేసిన టీం మొత్తం తిరిగి ఇండియాకు బయలుదేరింది. యూఎస్ లో షూటింగ్ సినిమా 80 శాతం పూర్తయింది. కొద్దివారాల్లో హైదరాబాద్ లో మిగతా పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినట్లు యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నెగిటివ్ పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో అర్జున్ చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ విలన్ పాత్ర చేయలేదు. ఆయన తప్ప వేరెవరూ ఆ పాత్రకు అంత సూటవరని దర్శకుడు హను రాఘవపూడి గట్టి నమ్మకంతో చెబుతున్నారు.
లై అనే ఇంగ్లిష్ మాటకు అబద్ధం అనే అర్ధముంది. కానీ ఇక్కడ ఎల్ ఐ ఇ అంటే లవ్ ఈజ్ ఎండ్ లెస్ అని అర్ధమట. ప్రేమ కథా చిత్రాలను మంచి ఫీల్ తో తీయడంలో హను రాఘవపూడికి కాస్త మంచి గుర్తింపే ఉంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు కొత్త అందమైన మేఘా ఆకాష్ పరిచయం కాబోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/