నితిన్ ఆ ద‌ర్శ‌కుడితో ప‌క్కా

Update: 2016-06-07 15:06 GMT
అఆ ఫ‌లితం గురించి ఆస‌క్తిగా ఎదురు చూశాడు నితిన్‌. ఆ సినిమా ఏ స్థాయిలో ఆడుతుందో, ఎంత వ‌సూలు చేస్తుందో చూసుకుని అందుకు త‌గ్గ‌ట్టుగానే  కొత్త సినిమాపై నిర్ణ‌యం తీసుకోవాల‌నుకొన్నాడు. ఎట్ట‌కేల‌కి అఆ ఘ‌న విజ‌యం సాధించింది. 60కోట్ల పైచిలుకు వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు జోస్యం చెబుతున్నాయి. ఇక నితిన్ భారీ స్థాయి సినిమాకే ప్లాన్ చేసుకోవ‌చ్చు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు స‌మాచారం. నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల రాసిన స్క్రిప్టునే ఆయ‌న ప‌క్కా చేసిన‌ట్టు తెలుస్తోంది.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైనర్‌ గా తెర‌కెక్క‌నున్న ఆ సినిమాకి కాస్త భారీ బ‌డ్జెట్టే అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. మార్కెట్ పెరిగింది కాబ‌ట్టి నితిన్ అదే సినిమా చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్టు స‌మాచారం. నిజానికి నితిన్ కోసం గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్  కూడా సిద్ధంగా ఉంది. దాంతో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కులు నితిన్‌ తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. అయినా వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి కిషోర్ తిరుమ‌ల‌కి ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.  నితిన్ సొంత బ్యాన‌ర్‌ లో త్వ‌ర‌లోనే ఆ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News