రాను రాను సినిమాలు పక్కా క్లాస్ అయిపోతున్నాయి. మాస్ ను ఊపేసే సినిమాలు తగ్గిపోతున్నాయి. అలాగని ఫిలింమేకర్స్ మాస్ ను పూర్తిగా పట్టించుకోకుండా ఏమీ లేరు. వాళ్లను అలరించే అంశాల్ని సినిమాలో పెట్టడానికే ప్రయత్నిస్తున్నారు. గురువారం విడుదలైన కొత్త సినిమా ‘చల్ మోహన్ రంగ’లోనూ అలాంటి అంశాలున్నాయి. ఈ చిత్రం ప్రధానంగా క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథాకథనాలతో తెరకెక్కింది. అలాగని ఇది మాస్ కు దూరమయ్యే ఏమీ కాదు. ఇందులోని కామెడీ మాస్ ప్రేక్షకుల్ని అలరించేదే. ఇక ఈ చిత్రంలోని ఒక పాట అయితే మాస్ కు విందు భోజనమే అని చెప్పాలి. అదే.. పెద్ద పులి పాట. ఆడియోతోనే జనాల్ని ఊపేసిన ఈ పాట.. సినిమాకు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సినిమాలో ముందుగా వచ్చే పాట ‘పెద్ద పులి’నే. హీరోకు అమెరికా వీసా రావడంతో ఆ సంబరాల్లో భాగంగా వస్తుందీ పాట. ఈ తెలంగాణ జానపద గేయాన్ని రాహుల్ సిప్లిగంజ్ భలేగా పాడాడు. ఒరిజినల్ సాంగ్ ను ఇంకాస్త ఇంప్రొవైజ్ చేసి తమన్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు. ఇక ఈ పాటలు డ్యాన్సులు మోతెక్కిపోయాయి. ఈ పాట సింగిల్ స్క్రీన్లలో జనాల్ని ఊపేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సింగిల్ స్క్రీన్లలో స్పందన మామూలుగా లేదంటున్నారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘చల్ మోహన్ రంగ’కు ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి. సమ్మర్ సీజన్లో రావడం వల్ల ఈ చిత్రం వీకెండ్లోనే పెట్టుబడిలో చాలా వరకు వెనక్కి తెచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. బయ్యర్లు లాభాల బాట పట్టడానికి మంచి అవకాశాలే ఉన్నాయి.