ఈసారి పవన్‌ సేవ్‌ చేస్తాడా?

Update: 2015-08-17 22:43 GMT
పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కి నితిన్‌ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఒక ఫ్యాన్‌ గా నితిన్‌ ని కూడా పవన్‌ అభిమానిస్తుంటాడు. ఆప్యాయతను చూపిస్తుంటాడు. అవసరమైతే ఆడియో వేడుకలకు వెళ్లి మరీ ఆశీర్వదించి మరీ వస్తుంటాడు. అయితే దీనినే కొందరు వక్రీకరించి పవన్‌ ని నితిన్‌ తెలివిగా వాడేసుకుంటున్నాడు అని ప్రచారం సాగిస్తున్నారు. అభిమానానికి కమర్షియాలిటీని జోడిస్తున్నారు. నితిన్‌ తాను నటించే ప్రతి సినిమాలో పవన్‌ నే స్మరించడం వల్ల ఇలాంటి అనుమానాలు రెయిజ్‌ అయ్యాయి. అయితే అదంతా కేవలం అభిమానంతో  మాత్రమేనని పవన్‌ భావిస్తాడు.

ఒక అభిమానిగా ఈసారి నితిన్‌ మరో ముందడుగు వేశాడు. తన సినిమాకి ఏకంగా 'కొరియర్‌ బోయ్‌ కల్యాణ్‌' అంటూ తన అభిమాన హీరో పేరునే టైటిల్‌ కి తెచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో పవన్‌ పై ఓ డైలాగ్‌ కూడా ఉంటుంది. అది థియేటర్‌ లో జనాల చేత చప్పట్టు కొట్టిస్తుందని నితిన్‌, గౌతమ్‌ మీనన్‌ చెబుతున్నారు. ఫార్ములా బాగానే ఉంది కానీ, అన్నిసార్లు పవన్‌ నామజపమే కాపాడదు. గతంలో 'చిన్నదాన నీకోసం' చిత్రంలోనూ పవన్‌ కి అభిమానిగా నటించాడు నితిన్‌. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. మరి ఇప్పుడైనా పవన్‌ కాపాడుతాడంటారా?
Tags:    

Similar News