1998లో 'ది మంకీ హూ నో టూ మచ్' అనే ఇండియన్ ఇంగ్లీష్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆ అమ్మాయి 2006లో 'సెవన్ ఓ క్లాక్' అనే కన్నడ చిత్రంలో సహాయ నటిగా నటించి.. 2008వ సంవత్సరంలో 'ఆకాశ గోపురం' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2009 మరియు 2010లో కన్నడ మరియు మలయాళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి 2011లో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'అలా మొదలైంది' చిత్రంతో వచ్చింది. ఇప్పటికే ఆమె ఎవరో అర్థం అయ్యింది కదా.. అవును ఆమె నిత్యామీనన్. రెగ్యులర్ హీరోయిన్స్ కు భిన్నంగా ఉన్నా.. స్కిన్ షోకు ఒప్పుకోకున్నా కూడా నిత్యామీనన్ తన కెరీర్ లో హాఫ్ సెంచరీ సినిమాలను చేరుకుంది. ప్రస్తుతం తన 50వ చిత్రం ఆన్ కార్డ్స్ అంటూ స్వయంగా నిత్యామీనన్ ప్రకటించింది.
తెలుగులో అలా మొదలైంది చిత్రం చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె కెరీర్ స్పీడ్ అందుకుంది. అంతకు ముందు వరకు ఆమె హీరోయిన్ గా 8 చిత్రాలు మాత్రమే చేయగలిగింది. తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో కన్నడం మరియు మలయాళంలో కూడా ఈమెకు ఛాన్స్ లు ఎక్కువగా వచ్చాయి. తాజాగా హిందీ 'మిషన్ మంగళ్' చిత్రంలో కూడా ఈమె నటించింది. మల్టీ ట్యాలెంట్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న నిత్యామీనన్ కేవలం హీరోయిన్స్ పాత్రలే చేస్తానంటూ మడి కట్టుకుని కూర్చోలేదు. పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలన్నీ కూడా ఈమె చేస్తూ వచ్చింది.
ఈమెకు కాస్త టెక్కు ఎక్కువ అంటూ విమర్శలు ఉన్నా.. ఆమె గురించి పుకార్లు పుట్టుకు వచ్చినా కూడా ఆమె ప్రతిభ ఆమెకు ఛాన్స్ లను తెచ్చి పెట్టింది. ఏ పాత్ర ఇచ్చినా కూడా అందులో లీనం అయ్యి మరీ నటించడం ఆమె గొప్పతనం అంటూ ఉంటారు. మహానటి చిత్రంలో నిత్యామీనన్ అయితే బాగుంటుందని మొదట నాగ్ అశ్విన్ అనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఛాన్స్ ను నిత్యామీనన్ కోల్పోయింది. సావిత్రి పాత్రను కోల్పోయాననే బాధ లేకుండా 'ఎన్టీఆర్' చిత్రంలో బాలకృష్ణతో సావిత్రి పాత్రలో కొద్ది సమయం నటించింది.
నిత్యామీనన్ బాగా లావు అవుతుంది అంటూ విమర్శలు వచ్చినా ఆమె పట్టించుకోలేదు. నేను నాలాగే ఉంటాను. నేను లావు అవ్వడం అనేది నా వ్యక్తిగత విషయం. లావు అవ్వడం వల్ల సినిమాల ఛాన్స్ లు తగ్గుతాయని నేనేం బాధ పడను. మీరు నాకు ఆ విషయం పై సలహాలు ఇవ్వనక్కర్లేదు అంటూ సీరియస్ అయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను చూస్తే ఒక హీరోయిన్ పాతిక సినిమాలు చేయడం అంటే చాలా గొప్ప విషయం. కాని నిత్యామీనన్ మాత్రం ఏకంగా 50 సినిమాలు చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయి. నిత్యామీనన్ దక్కించుకున్న ఈ రికార్డ్ మామూలుది కాదు. ఆమెకు నటనపై ఉన్న ప్యాషన్ అన్ని సినిమాల్లో నటింపజేసిందనడంలో సందేహం లేదు. నిత్యామీనన్ ముందు ముందు మరో హాఫ్ సెంచరీ సినిమాలు చేసే అవకాశం ఉందనిపిస్తుంది.