రింగుల జుత్తు సుందరి నిత్యామీనన్ లో డేరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెరీర్ ఆరంభమే వెంకటేష్ లాంటి ముదరు హీరోతో నటించను అని నిర్భయంగా చెప్పేసింది. అటుపై ప్రభాసా.. ఆయనెవరు? అంటూ కాస్త టెంపరితనం చూపించింది. ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడేసి కొందరిని నానా ఇబ్బందులకు గురి చేసింది.
అసలే ఈగోయిస్టిక్, మేల్ డామినేటెడ్ వరస్ట్ ఇండస్ర్టీ మనది. అందులో వేలు పెట్టి కెలికింది అమ్మడు. ఆరంభం మీడియాకి ఓ సరుకు అయిపోయింది. టీఆర్‌పీ రేటింగ్ అయ్యి బుల్లితెరకు లాభాలు తెచ్చిపెట్టే హీరోయిన్ అయ్యింది. ఏదేమైనా ఇప్పుడు కాస్తంత పరిణతి సంపాదించి ఆచితూచి మాట్లాడుతోంది. అయినా నేనింకా స్ర్టిక్టు. దానిని యారోగెన్సీ అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. మా అమ్మా - నాన్న ఉద్యోగులు. అందువల్ల నాతో ఉండడం కుదరదు. అలాగని నాకు పర్సనల్‌గా మేనేజర్ అనేవాడే లేడు. అలాంటప్పుడు సెట్స్ లో ఇంకెవరు ఉంటారు? అందుకే ఎవరైనా నాతో చనువుగా ఉండి, అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ..! అందుకే నేను ఎంతో జాగ్రత్తగా ఉంటాను. తేడాగాళ్లు ఎవరైనా తగిలితే వెంటనే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాను.. అంటూ కాస్త ఘాటుగానే చెప్పింది.
అసలింతకీ ఎవరైనా అలాంటివాళ్లు తగిలారా? అని అడిగితే బై గాడ్స్ గ్రేస్ అలాంటివాళ్లెవరూ తారసపడలేదని చెప్పింది. ప్చ్... ఒకవేళ తగిలితే చెబుతుందా ఏంటి?