ఈ బికినీపై పెయింట్ ఎందుకు వేయలేదు?

Update: 2017-07-29 06:02 GMT
ఇప్పుడు సెన్సార్ బోర్డు అనేది ఒకరికి ఫేవర్ గా ఒకరికి ఫీవర్ తెప్పించే విధంగా ఉండకూడదు. కాని మన దగ్గర మాత్రం ఒక్కోసారి ఈ బోర్డు ఒక్కోలా రియక్ట్ అవుతుంటే.. జనాలకు అనేక సందేహాలు వస్తున్నాయి. అప్పట్లో ఒక లేడీ సెన్సార్ ఆఫీసర్ ఉన్నప్పుడు.. స్వయంగా మోహన్ బాబు వంటి వారినే మూడు చెరువుల నీళ్ళు తాగించింది. ఇప్పటి సెన్సార్ అధికారులు అంత టఫ్‌ గా లేరుకాని.. ఇక్కడ బికినీల విషయంలో కొత్త రభస నడుస్తోంది.

మొన్నామధ్యన డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో స్విమ్మింగ్ పూల్ నుండి హీరోయిన్ పూజా హెగ్డే బయటకొచ్చే సన్నివేశం ఒకటే ఉంది. ఈ సన్నివేశంలో ఆమె తొడలు ఎవ్వరికీ కనిపించకూడదని సెన్సార్ వాటిని బ్లర్ చేయించింది. అక్కడ ఏదో వైట్ పెయింట్ ఒకటి వేయించింది. అంతకంటే ముందు కూడా చాలామంది హీరోయిన్లు ఈ బ్లర్రింగ్ ఎదుర్కొన్నారు. కాజల్ కూడా బిజినెస్ మ్యాన్ నుండి గోవిందుడు అందరివాడేలే సినిమా వరకు ఈ పెయింట్ వెయించుకోక తప్పలేదు. కాని నిన్న రిలీజైన గౌతమ్ నంద విషయంలో మాత్రం అలాంటిదేం లేదు. అక్కడ క్యాథరీన్ చక్కగా బికినీలో నడుచుకుంటూ వచ్చే సీన్ ఏకంగా రెండుసార్లు చూపించారు. అది కూడా చాలా లెంగ్త్ ఉంది. బ్లర్ చేయడం.. పెయింట్ వేయడం.. అబ్బే ఏమీ లేవ్.

అందుకే ఇప్పుడు క్యాథరీన్ బికినీకి ఎప్లయ్ కాని పెయింటింగ్ అండ్ బ్లర్రింగ్ అప్పట్లో మా సినిమాలకు ఎందుకు అప్లయ్ అయ్యిందంటూ ఆ నిర్మాతలు వాపోతున్నారు. ఆ లెక్కన చూస్తుంటే.. అయితే సెన్సార్ వారు పర్మిషన్ ఇచ్చేసుండాలి.. చూసీచూడనట్లు వ్యవహరించి ఉండాలి.. లేదంటే వారు చెప్పినా కూడా ఈ సినిమా మేకర్లు కావాలనే బ్లర్ చేయకుండా వదిలేసి ఉండాలి. అంతేనా?
Tags:    

Similar News