విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన బయోపిక్ మొదటి భాగం డిజాస్టర్ కావడంతో క్రిష్ తో పాటు బాలయ్య సైతం అయోమయంలో పడిన మాట వాస్తవం. బయటికి చెప్పినా చెప్పకపోయినా 70 కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఒక స్టార్ హీరో మూవీ కేవలం 20 కోట్లు తేవడం అంటే చిన్న విషయం కాదు. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతోనే బాహుబలి తరహాలోనే సీక్వెల్ ప్లాన్ చేసి స్క్రిప్ట్ ని రెండు భాగాలు చేసి మహానాయకుడుని ఫిబ్రవరిలో తెద్దాం అనుకున్నారు.
కథానాయకుడు విడుదలకు ముందు వదిలిన ట్రైలర్ లో అన్ని కూర్చి రూపొందించారు. ఇప్పుడు అంచనాలు తలకిందులయ్యాయి. ఫిబ్రవరి 9 మహానాయకుడు వస్తాడు అని గతంలో ప్రకటించిన డేట్ కి కట్టుబడలేని పరిస్థితి. 15న ఒకరు లేదు 22 అని మరొకరు ఇలా ఎడతెగని ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు తెగుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు నిర్మాతలు ప్రచారాన్ని పూర్తిగా ఆపేశారు.
సో నందమూరి అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఒకటే. మహానాయకుడికి నిజంగా ఈ నెలలో వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే సమ్మర్ కు రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు.
ఎన్నికల ప్రకటన వచ్చి కోడ్ అమలులోకి వస్తే సెన్సార్ పరంగా చిక్కులు రావొచ్చు. సో ఏదో జరిగినా ఆ లోపు మాత్రమే పూర్తి చేయాలి. అయితే మహానాయకుడికి రిపేర్లు చేస్తున్నారని దీనికే కొంత టైం పట్టేలా ఉందని 20 లోపు ఫైనల్ కాపీ రెడీ చేయడం కష్టమని మరో టాక్ ఉంది. ఒకవేళ అవాంతరాల వల్ల వేసవి కే షిఫ్ట్ అయితే ఉన్న కాస్త ఆసక్తి అయినా నిలుస్తుందా అనే అనుమానం వస్తుంది. అందుకే మహానాయకుడు సృష్టించిన అయోమయం తీరాలి అంటే క్రిష్ అయినా బాలయ్య అయినా ఎవరో ఒకరు చెప్పాలి. అప్పటిదాకా ఈ సస్పెన్స్ తప్పదు