#క‌రోనా: విరాళం ఇస్తే జీఎస్టీ క‌ట్ట‌క్కర్లేద‌న్న హామీ!

Update: 2020-04-01 04:30 GMT
ప్ర‌పంచానికి క‌రోనా పాఠాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఎవ‌రు దాన‌క‌ర్ణుడు? ఎవ‌రు స్వార్థ‌ప‌రుడు? ఎవ‌రు ప‌బ్లిసిటీ పిచ్చోడు? ఎవ‌రు కాదు? అన్న‌ది బ‌య‌టికే తెలిసిపోతోంది. ఆర్జీవీ లాంటి స్వార్థ‌ప‌రులు ఉన్న చోట ప్ర‌భాస్ రాజు లాంటి దాన‌గుణం ఉన్న స్టార్ ఉన్నారు మ‌రి. ఆయ‌న జీరో సాయంతో చేతులు దులిపేసుకుంటే ప్ర‌భాస్ మాత్రం 4కోట్లు సాయం చేసి ది బెస్ట్ టాలీవుడ్ (పాన్ ఇండియా) స్టార్ అనిపించాడు. అటు మెగా కాంపౌండ్ స‌హా అక్కినేని నంద‌మూరి కాంపౌండ్లు ఇత‌ర కాంపౌండ్లు భారీగా విరాళాల్ని బ‌య‌టికే ప్ర‌క‌టించేశాయి. ఎవ‌రి బ‌లం వాళ్లు ప్ర‌ద‌ర్శించార‌న్న టాక్ ఉంది.

ఇక‌పోతే విప‌త్తు వ‌చ్చినా ఏనాడూ స్పందించ‌ని... అస‌లు ఎడ‌మ చేత్తో అయినా కాకిని అదిలించ‌ని బాప‌తు చాలామందే ఉన్నారు. కోట్ల‌లో ఆర్జిస్తూ తిరిగి వెన‌క్కు ఇవ్వ‌ని వాళ్ల‌కు మీడియా బ‌డితె పూజ త‌ప్ప‌డం లేదు. మ‌రో సెక్ష‌న్ సెల‌బ్రిటీల్ని చూస్తే వీళ్లంతా అంతో ఇంతో డొనేట్ చేశారు. కానీ ఎంత డొనేట్ చేశారు? అన్న‌ది ప‌బ్లిసిటీకి  పెట్ట‌డం లేదు. కొంద‌రు అబ‌గా మేం ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం అని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే కొంద‌రు ఏదో ఇచ్చాంలే దానికి ప్ర‌చారం ఎందుకులే అన్న‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. ఈసారి ఆస‌క్తిక‌రం గా సినీ సెల‌బ్రిటీల‌తో పాటు క్రికెట‌ర్లు కూడా భారీ విరాళాల్ని పీఎం నిధికి జ‌మ చేశారు. స‌చిన్.. విరుష్క స‌హా ప‌లువురు క్రికెట‌ర్లు భారీ విరాళాలు ఇవ్వ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

స‌చిన్ .. అంబానీల రేంజు వేరులే అనుకుంటే విరుష్క మూడు కోట్ల (చెప్పుకోలేదు) మేర విరాళం ఇవ్వ‌డం కాస్త చిన్న‌బుచ్చుకునేదే. ఏడాదికి వంద‌ల కోట్ల వార్షికాదాయం ఉన్న వీళ్ల కంటే మ‌న ప్ర‌భాసే బెట‌ర్ అన్న టాక్ వినిపిస్తోంది. డార్లింగ్ ప్ర‌భాస్ ఏకంగా 4కోట్లు డొనేట్ చేశాడు. విరాట్ తో పోలిస్తే ఆదాయ ఆర్జ‌న‌లో ప్ర‌భాస్ ఎంత‌? అందుకేనేమో.. ప్ర‌భాస్ కంటే త‌క్కువిచ్చామ‌నే నామోషీతోనే విరుష్క అస‌లు త‌మ డొనేష‌న్ ఎంత‌? అన్న‌ది చెప్ప‌డం లేదు. మ‌రోవైపు కిలాడీ అక్ష‌య్ కుమార్ లాంటి హీరో ఏకంగా 25 కోట్లు విరాళంగా ప్ర‌క‌టించ‌డంతో ఆ మొత్తం ముందు ఎవ‌రు ఎంత ఇచ్చినా క‌న‌బ‌డ‌డం లేదు. ఇక దాన‌గుణం అన్న‌ది కొంద‌రికే చెల్లిన‌ది. స‌చిన్ లాంటి స్టార్ విప‌త్తు స్థాయిని అర్థం చేసుకుని దాన‌మిచ్చారు త‌ప్ప ఇంత‌కుముందు ప్ర‌కృతి వైప‌రీత్యాల వేళ‌ ఇంత పెద్ద రేంజులో స్పందించిందేమీ లేదు. ఇక‌పోతే ఎంత‌మంది స్టార్లు ఎంత ఇచ్చినా కానీ వీళ్లంద‌రి కంటే నేచుర‌ల్ స్టార్ నాని ఇచ్చిన డొనేష‌న్ ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకునేదే. చిరు సార‌థ్యంలోని సీసీసీ కి ఏకంగా 30ల‌క్ష‌లు ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

అదంతా స‌రే కానీ.... ఇలాంటి స‌మ‌యంలో డొనేష‌న్లు ఇచ్చే సెల‌బ్రిటీల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఏదైనా ఆఫ‌ర్ ఇచ్చారా?  ఆదాయ ఆర్జ‌న‌లో పారితోషికాల్లో జీఎస్టీ మినహాయింపు ఏదైనా ఆఫ‌ర్ చేశారా? అంటూ డౌట్ పుట్టుకొస్తోంది. అయితే దానిని అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండా స‌ద‌రు స్టార్ల‌కు సెల‌బ్రిటీల‌కు ఏదైనా ఆఫ‌ర్ చేశారా? అందుకే ఇంత‌మంది ఎప్పుడూ దానం చేయ‌ని జాబితా వాళ్లు కూడా బ‌య‌ట‌ప‌డ్డారు? అన్న డౌట్లు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయి. ఇక ఎవ‌రు ఎంత దాన‌మిచ్చినా చెప్పుకున్నా చెప్పుకోక‌పోయినా వీళ్లంతా ఘ‌నులే! అంటూ కొంద‌రు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు.  విరాళం ఇచ్చి కూడా సిగ్గు ప‌డ‌డం ఎందుకు? అని విమ‌ర్శించే వాళ్లు కూడా ఉన్నారు.
Tags:    

Similar News