అవును.. కంగన మంచి బాలిక. అస్సలు గొడవపడదు. ఎవరితోనూ ఈగోలకు పోదు. తానేం చేయాలనుకుంటుందో అది చేస్తుందంతే! అందుకే క్వీన్ ధీరత్వానికి ఫ్యాన్స్ ఉంటారు. అదంతా సరే.. అప్పట్లో క్రిష్ తో గొడవ పెట్టుకుని డైరెక్టర్ కుర్చీ లాక్కుంది కదా? అన్న సందేహం కలిగితే... అందుకు తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.
అసలు క్రిష్ తో కంగన గొడవ పెట్టుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే వంద రోజుల్లో మొత్తం మణికర్ణిక షూటింగ్ పూర్తి చేసి రఫ్ కట్ కూడా ముగించి, మణికర్ణిక నిర్మాతలకు అప్ప జెప్పేశాడు క్రిష్. ఆ క్రమంలో నే రైటర్ విజయేంద్ర ప్రసాద్ కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. దీంతో బకాయి షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఈలోగానే క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్‌కి కమిటైపోయాడు. ఈ బయోపిక్ చిత్రీకరణ పూర్తయ్యాక మణికర్ణిక పెండింగ్ పూర్తి చేద్దామని అన్నాడట. అయితే క్రిష్‌తో ఏ గొడవా లేకుండానే, బ్యాలెన్స్ బాధ్యతల్ని క్వీన్ కంగన చేపట్టింది. అందుకు నిర్మాతలు ఏమాత్రం అభ్య ంతరం చెప్పలేదు.
అలా క్వీన్ కంగన దర్శకురాలిగా మారి హ్యాట్ ధరించింది. క్లాప్ బోర్డ్ లో తన పేరు వేసుకుంది. అయితే ఇదంతా ఇన్ టైమ్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, చెప్పిన సమయానికే మణికర్ణిక చిత్రాన్ని విడుదల చేసేందుకు పడిన తపన మాత్రమే. దీనర్థం.. క్రిష్ తో గొడవ పడడం లేదా విభేధించడం అసలు కానేకాదు! అని మొత్తానికి తేల్చేశారు. ఇంకా చెప్పాలంటే తూచ్! మా మధ్య గొడవల్లేవ్!! అని చెబుతున్నారన్నమాట. మరి అలాంటప్పుడు అదే విషయాన్ని క్రిష్ ఎందుకు ప్రకటించలేదు సామాజిక మాధ్యమాల వేదికగా? ఊళ్లో జనం అసలేం జరుగుతోందో అర్థంగాక బుర్రపీక్కుంటుంటే... వినోదం చూసినట్టు చూశాడేం? మణికర్ణికకు ఫ్రీ ప్రీపబ్లిసిటీ బావుందిలే అని భావించాడా? జనవరి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజీగా రిలీజవుతోంది