టాప్ స్టోరి: ద‌స‌రా దీపావ‌ళి సౌండే లేదు

Update: 2019-10-05 09:37 GMT
తెలుగు సినిమాల‌కు బాగా క‌లిసి వ‌చ్చే పండ‌గలు విజ‌య‌ద‌శ‌మి.. దీపావ‌ళి.. సంక్రాంతి. ఈ మూడు సీజ‌న్ల‌లో రిలీజ్ చేస్తే భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌వ‌చ్చ‌న్న‌ది మ‌న ఫిలింమేక‌ర్స్ న‌మ్మ‌కం. ఈ పండ‌గ‌ల రోజుల్లో పిల్ల‌ల‌కు సెల‌వులు వుండ‌టంతో కుటుంబ స‌మేతంగా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తుంటారు. దీంతో ఆ స‌మ‌యాల్లో రిలీజ్ అయ్యే చిత్రాల్నీ భారీ స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌డుతుంటాయి. నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తుంటాయి.  ఈ మార్కెట్ లెక్క‌ల కార‌ణంగానే పండగ‌ సీజ‌న్ ని న‌మ్మి సినిమాల్ని బ‌రిలోకి దింపాల‌ని పోటీప‌డుతుంటారు.

అలా ఈ ద‌స‌రా.. దీపావ‌ళి సీజ‌న్ ఆల్రెడీ మొద‌లైంది. ఈ రెండు పండ‌గ‌ల్ని క్యాష్ చేసుకుని కోట్లు కొల్ల‌గొట్టాల‌ని చాలా సినిమాలే పోటీప‌డుతున్నాయన్న సంగ‌తి ఎంద‌రికి తెలుసు? ఇప్ప‌టికే రిలీజైన 'సైరా న‌ర‌సింహారెడ్డి' బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స్వైర విహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల‌ బాక్సాఫీస్ వ‌ద్ద మెగాస్టార్ హ‌వా క‌నిపిస్తోంది. ఈ సినిమా త‌రవాత మొత్తం 10 చిత్రాలు బాక్సాఫీస్ యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ రేస్ లో భాగంగా  శ‌నివారం గోపీచంద్ న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ 'చాణ‌క్య‌' ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. యావ‌రేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. న‌వీన్ విజ‌య‌కృష్ణ న‌టించిన 'ఊరంతా అనుకుంటున్నారు' చిత్రం కూడా ఇదే రోజు విడుద‌లైంది. టాక్ ఇంకా బ‌య‌టికి రాలేదు. ఈనెల‌ 8న అంటే ద‌స‌రా రోజు 'ఎవ్వ‌రికి చెప్పొద్దు' విడుద‌ల కాబోతోంది. క్యాస్టిజ‌మ్ (కులం ఫీలింగ్) నేప‌థ్యంలో అ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు తెలుస్తోంది.

 'ఆర్.ఎక్స్ 100' ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించిన 'ఆర్.డి.ఎక్స్ ల‌వ్‌' ఈనెల 11న రిలీజ్ అవుతుండ‌గా ఇదే రోజున సిద్ధార్ధ్ న‌టించిన త‌మిళ డ‌బ్బింగ్ చిత్రం 'వ‌ద‌ల‌డు' రిలీజ్ అవుతోంది. ఇక దీపావ‌ళి బ‌రిలో అల్ల‌రి అల్లుడు.. విజ‌య్ న‌టించిన‌ 'విజిల్‌'.. కార్తి సినిమా 'ఖైదీ'.. బిత్తిరి స‌త్తి 'తుపాకి రాముడు'.. కార్తికేయ గుమ్మ‌కొండ '90ఎం.ఎల్‌' రిలీజ్ కి పోటీప‌డుతున్నాయి. విజ‌య్.. కార్తీల‌కు త‌మిళంలో ఉన్నంత ఆద‌ర‌ణ తెలుగులో లేద‌న్న సంగ‌తిని మ‌రువ‌రాదు. ఈ ద‌స‌రా బ‌రిలో నిలిచినవ‌న్నీ అంత క్రేజు లేని సినిమాలే. వీటికి స‌రైన ప్ర‌చారం కూడా లేదు. పైగా హిట్టు టాక్ తో ద‌స‌రా సెల‌వుల్ని 'సైరా'నే ఆక్ర‌మించేలా క‌నిపిస్తోంది. ద‌స‌రా.. దీపావ‌ళికి వ‌స్తున్నామ‌ని సంబ‌ర‌ప‌డినా.. ఇత‌ర చిత్రాల్ని మాత్రం స‌గ‌టు ప్రేక్ష‌కుడు ప‌ట్టించుకునేలా క‌నిపించ‌డం లేదు. ఈ సినిమాలు రిలీజ్ అవుతున్న‌ట్టు కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. ఆ రేంజ్ లో ప్ర‌చారంలో వెన‌క‌బ‌డ్డారు. చిన్న చిత్రాల‌కు ఇదే ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ప్ర‌చారానికి ఎంత బ‌డ్జెట్ వెచ్చించాలి? అన్న‌ది కూడా ప్ర‌ణాళిక‌లో భాగం చేయ‌డం లేదు. ఆ ఫ‌లితం చివ‌రిగా క‌నిపిస్తోంది. విజ‌య్ కి తెలుగులో మార్కెట్ లేదు.. వున్న మార్కెట్‌ని కార్తి పోగొట్టుకున్నాడు. వీరి సినిమాల ప్ర‌భావం కూడా అంతంత మాత్ర‌మే అని అర్థ‌మ‌వుతోంది.    


Tags:    

Similar News