బుక్ మై షో - పేటీఎంలో టికెట్ బుక్ చేయలేమా?
ఏపీ ప్రభుత్వం కొత్త జీవో ఇప్పుడు టాలీవుడ్ లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వమే ఇక ఐఆర్ సీటీసీ తరహా వెబ్ సైట్ ని ప్రారంభించి అందులో సినిమా టిక్కెట్లను విక్రయించనుంది. దీని వల్ల పన్ను సజావుగా ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఏపీ ప్రభుత్వం ప్రవచించింది. దీనివల్ల నిర్మాతలకు కూడా మేలు జరుగుతుందని ఇకపై వాస్తవిక రెవెన్యూ ఎలా ఉంటుందో బయటపడుతుందని ఇంతకుముందులా వంద కోట్లు 200కోట్లు అంటూ పోస్టర్లు వేసి అసలు వాస్తవాన్ని దాచేయడం కుదరదని చర్చ సాగుతోంది.
ఇది కొందరికి మోదం మరికొందరికి ఖేదం! అని భావిస్తున్నారు. మరోవైపు ఏపీ తేనున్న వెబ్ సైట్ వల్ల బుక్ మై షో.. పేటీఎం ల ద్వారా ఇక టిక్కెట్లు బుక్ చేసుకోవడం అనేది ఉండదని స్పష్ఠమైపోయింది. ఈ సైట్లలో ఏపీలో టిక్కెట్ల బుకింగ్ ఇక సాధ్యపడదు. తెలంగాణ సహా ఇతర చోట్ల ఇది వర్కవుటవుతుంది.
ఆన్ లైన్ పోర్టల్ కి అభ్యంతరం చెప్పకపోయినా కానీ.. సినీపెద్దల వెర్షన్ వేరొకలా ఉంది. తమకు మనుగడ సాగించాలంటే టిక్కెట్ ధరల పెంపు అవసరమని పరిశ్రమ పెద్దలు పేర్కొంటుండగా ప్రభుత్వం అదనపు షోలు లేదా బెనిఫిట్ షోలకు కూడా అనుకూలంగా లేదు. ఇప్పుడు, ప్రభుత్వం ఆన్ లైన్ లో టిక్కెట్లను విక్రయిస్తామని ప్రకటిస్తూ 142A GO ను విడుదల చేసింది.
దీని ప్రకారం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్- ఐఓఎస్ పరికరాల కోసం యాప్ ను రూపొందించింది. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఈ యాప్ లను డౌన్‌లోడ్ చేసి టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పేటీఎం బుక్ మై షో యాప్ లలో టిక్కెట్లు అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తారా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్ఠత లేదు.
ఆంధ్రప్రదేశ్ థియేటర్లలో టిక్కెట్ ధరలకు సంబంధించిన జిఓలను అమలు చేయడంపై ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ఇంత తక్కువ రేట్లతో మనుగడ సాగించలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం రేట్ల పెంపునకు సిద్ధంగా లేదు. స్థానిక కలెక్టర్లతో చర్చించిన తర్వాత థియేటర్లలో పెంపునకు హైకోర్టు అనుమతిని మంజూరు చేసింది.
కానీ అది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే ఉంది కాబట్టి టికెట్ పెంపు అనేది ఉండదని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ పోర్టల్ టికెటింగ్ తో నిర్మాతలకు మేలు జరుగుతుందా లేదా? అన్నదానిపై ప్రస్తుతం డిబేట్ సాగుతోంది. ఇంతకుముందులా కాకి లెక్కల స్థానంలో వాస్తవ లెక్కలు వెలుగు చూస్తాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వ పోర్టల్ అనేది చిన్న నిర్మాతకు మేలైనదేనని విశ్లేషిస్తున్నారు.