హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. టాలీవుడ్ లో వరుసగా మూడు సంవత్సరాలు కనీసం ఖాళీ లేకుండా సినిమాలు చేసిన రకుల్ గత రెండేళ్ల కాలంగా ఆఫర్లు దక్కించుకోవడమే గగనం అయ్యింది. ఈమద్య కాలంలో అసలు ఆఫర్లే లేవు. తెలుగుపై ఆశ వదులుకున్న ఈ అమ్మడు మెల్లగా బాలీవుడ్ మరియు కోలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా తమిళంలో ఈమె కమిట్ అయిన ఒక సినిమా నుండి తొలగించేందుకు చర్చలు జరుగుతున్నానే వార్తలు పలు వెబ్ మీడియాల్లో వచ్చాయి.
తమిళంలో రకుల్ ఒక సినిమాకు కమిట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ పున: ప్రారంభించేందుకు సిద్దం అవ్వగా వైరస్ భయంతో తాను ఇప్పట్లో షూటింగ్ కు హాజరు అవ్వలేను అంటూ చెప్పిందట. దాంతో ఆమె స్థానంలో మరో నటిని తీసుకునే యోచనలో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు అనేది ఆ వార్తల సారాంశం. ఈ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యింది.
రకుల్ సోషల్ మీడియా ద్వారా... బాధ్యతయుతమైన జర్నలిస్టులుగా వ్యవహరించాలి. మీడియా ఎప్పుడు కూడా వాస్తవాలను తెలుసుకుని రాయాలంటూ సూచించింది. ఎక్కడ షూటింగ్ జరుగుతుందో చెప్పండి నేను వెళ్తాను. అసలే పనిలేక విసుగుతో చస్తున్నాం అంటూ ఆ వార్తలకు రకుల్ కౌంటర్ ఇచ్చింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు మరి నీవు షూటింగ్ కు హాజరు అయ్యేందుకు నో చెప్పకుంటే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయని కొందరు నెటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు.