జాతీయ అవార్డు కమిటీని భయపెడుతున్న కంగనా

Update: 2019-03-25 06:04 GMT
బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉంటూనే ఉంది. ఇటీవల ఈమె నటించిన 'మణికర్ణిక' చిత్రం విషయంలో ఎంతటి వివాదం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకుడు క్రిష్‌ కు క్రెడిట్‌ ఇవ్వకుండా మొత్తం ఈమె క్రెడిట్‌ కొట్టేసింది అనే విమర్శలు ఎదుర్కొంది. ఎవరు ఏం అన్నా కూడా తానే మణికర్ణిక చిత్రానికి దర్శకత్వం వహించాను. నా వల్లే సినిమా హిట్‌ అ్యందని చెప్పుకుంటుంది. ఇక మణికర్ణిక అవార్డు విషయంలో కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కంగనాను 'మణికర్ణిక' చిత్రానికి అవార్డు వస్తుందని మీరు భావిస్తున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె స్పందిస్తూ... జాతీయ అవార్డుకు సంబంధించిన కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు మణికర్ణిక చిత్రంలో పుష్కలంగా ఉన్నాయనేది నా అభిప్రాయం. అందుకే మణికర్ణిక చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది. ఒక వేళ మా సినిమాకు జాతీయ అవార్డు రాకుంటే మాత్రం అవార్డు కమిటీని అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించింది.

'మణికర్ణిక' కంటే ఉత్తమమైన సినిమా వస్తే ఆ సినిమాకు అవార్డు ఇవ్వడం నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మణికర్ణిక కంటే ఉత్తమమైన సినిమా వస్తుందని మాత్రం నేను భావించడం లేదు. ఇక నటనలో కూడా నా కంటే బెటర్‌ గా ఎవరు నటించినా కూడా వారికి అవార్డు ఇస్తే నేను సంతోషిస్తాను అంది. అవార్డు కమిటీకి ఇండైరెక్ట్‌ గా కంగనా చేస్తున్న వార్నింగ్‌ ఇప్పుడు జాతీయ మీడియా వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఒకవేళ ఈసారి మణికర్ణికకు అవార్డు రాకుంటే కంగనా సీరియస్‌ అయ్యే అవకాశం ఉందని, ఆ భయంతో అవార్డు కమిటీ వారు ఆమె సినిమాకు ఒకటి రెండు అవార్డులు అయినా ఇచ్చే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News