నాకు నలుగురు చాలు.. నయన్ లేదు

Update: 2015-12-12 09:35 GMT
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగిసిందని కొబ్బరికాయ కూడా కొట్టేశాక.. డిక్టేటర్ పై రెండు రోజులుగా ఓ రూమర్ మొదలైంది. అదే నయన తారను సినిమాలోకి తీసుకున్నారని, ఐటెం సాంగ్ చేయించనున్నారనే టాక్ వ్యాపించింది. మీడియాలో కూడా దీనిపై బాగానే ప్రచారం జరిగింది.

సింహ, శ్రీరామరాజ్యం తర్వాత బాలయ్య, నయన్ ల కాంబినేషన్ లో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ అనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. ముందు ఈ వార్తలను లైట్ తీసుకున్న డిక్టేటర్ డైరెక్టర్ శ్రీవాస్.. ఇప్పుడు స్పందించాడు. "ఈ సినిమాలో నయనతార ఉందన్న మాటలు అబద్ధం. ఈ వార్తలను మీడియానే పుట్టించింది. నయన్ ను ఏ పాత్రకు అనుకోలేదు. ఐటెం సాంగ్ ను ఇప్పటికే షూటింగ్ కూడా చేసేశాం. శ్రద్ధా దాస్ ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఈమె కాకుండా డిక్టేటర్ లో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్షలు మంచి కేరక్టర్లతో అలరించనున్నారు. ఇక నయనతారను తీసుకునే అవకాశం ఏ మాత్రం లేదు." అంటూ వివరణ ఇచ్చాడు శ్రీవాస్.

ప్రస్తుతం డిక్టేటర్ కి సంబంధించిన రికార్డింగ్, రీరికార్డింగ్ వర్క్స్ జరగాల్సి ఉంది. అయితే.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్టూడియో.. చెన్నై వరదల ప్రభావానికి దెబ్బ తినడంతో.. ఈ పనులు ఆలస్యం జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా వీటిని పూర్తి చేసి, రీరికార్డింగ్ స్టార్ట్ చేసేందుకు థమన్ చాలా కష్టపడుతున్నాడు.
Tags:    

Similar News