ఇద్దరు హీరోల గాయాల దెబ్బకు షూటింగ్ ఇప్పటికే రెండు నెలలు వాయిదా వేసుకున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ రెండు వారాల నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకో 2 నెలల్లో స్వతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి ఆగస్ట్ 15 ఫస్ట్ లుక్ లేదా టీజర్ లాంటిది ఏదైనా విడుదల చేస్తారేమో అని ఆశించిన అభిమానులకు రాజమౌళి సమాధానం చెప్పేశాడు. అలాంటి ప్రణాళిక ఏది లేదని టైం పడుతుందని క్లారిటీ ఇచ్చాడు.
సో ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఆ రోజు వస్తుందేమో అని ఎదురు చూడటం వృధా ప్రయాసే. దీనికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ఇంకా ఏడాది టైం ఉంది. ఇప్పటికే కావాల్సిన దాని కన్నా హైప్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇంత అడ్వాన్స్ గా ప్రమోషన్ మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎలాగూ జనవరి 26 గణతంత్ర దినోత్సవం వస్తుంది అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు
రెండో కారణం సాహో రిలీజ్. అదే రోజు విడుదల కాబట్టి థియేటర్ల బయట మొదలుకుని సోషల్ మీడియా దాకా ప్రతిఒక్కరు దాని గురించే చర్చల్లో ఉంటారు. ఆ హీట్ లో ఆర్ఆర్ఆర్ లుక్ కానీ ఇంకేదైనా వీడియో కానీ వదలడం కరెక్ట్ కాదు. అందుకే రాజమౌళి ఇవన్నీ ఆలోచించే ముందు నిర్మాణం మీద ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడట. ఎలాగూ ఆయన సినిమాలకు వద్దన్నా ప్రమోషన్ వచ్చేస్తుంది.
చిన్న ప్రెస్ మీట్ పెట్టినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కవరేజ్ వస్తుంది. అలాంటప్పుడు ఇంత త్వరగా ఆర్ఆర్ఆర్ హడావిడి స్టార్ట్ చేయకూడదు అనుకోవడం సబబే. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తోంది కాబట్టి రెగ్యులర్ గా ఏదో ఒక అప్ డేట్ ఇమ్మని కోరుతున్నారు. ఇవన్నీ అయ్యే పనులు కావు కానీ ఇంకో రెండు మూడు నెలలు ఎలాంటి లీక్స్ ఆర్ఆర్ఆర్ గురించి పెద్దగా ఉండకపోవచ్చు