తమన్నాపై మనసు మార్చుకున్న చైతూ దర్శకుడు

Update: 2018-09-11 08:41 GMT
నాగచైతన్య మరో రెండు రోజుల్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో హీరోయిన్‌గా అను ఎమాన్యూల్‌ నటించింది. శైలజా రెడ్డి అల్లుడు చిత్రంకు ముందే నాగచైతన్య, చందు మొండేటిల కాంబినేషన్‌లో ‘సవ్యసాచి’ ప్రారంభం అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్‌ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఆమద్య సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. కాని శైలజా రెడ్డి అల్లుడు కారణంగానే వాయిదా వేయడం జరిగింది. ‘సవ్యసాచి’ చిత్రం షూటింగ్‌ ఒక పాట - కొన్ని సీన్స్‌ ప్యాచ్‌ వర్క్‌ మినహా చిత్రీకరణ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.

నిన్న మొన్నటి వరకు సవ్యసాచిలో మిగిలి ఉన్న ఆ పాటను నాగచైతన్య మరియు తమన్నాలతో చేయించాలని భావించారు. ఇప్పటికే తమన్నాకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. సవ్యసాచిలో తమన్నా ఐటెం సాంగ్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించారు. అయితే తమన్నా ఇతర ప్రాజెక్ట్‌ ల కారణంగా ‘సవ్యసాచి’కి డేట్లు ఇవ్వలేక పోతుంది. దాంతో సినిమా నుండి తమన్నాను తొలగించి ఐటెం సాంగ్‌ కు బదులుగా హీరో - హీరోయిన్‌ లతోనే పాటను చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

సినిమాలోని ఆ సందర్బంలో ఐటెం సాంగ్‌ కంటే హీరో హీరోయిన్‌ ల కాంబో సాంగ్‌ అయితేనే బాగుంటుదనే అభిప్రాయం మెజార్టీ వర్గాల వారు వ్యక్తం చేశారట. దాంతో దర్శకుడు హీరో - హీరోయిన్‌ తోనే ఆ పాటను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం శైలజా రెడ్డి అల్లుడు చిత్రం ప్రమోషన్స్‌ లో చాలా  బిజీగా ఉన్న నాగచైతన్య సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత మళ్లీ ‘సవ్యసాచి’ చిత్రం షూటింగ్‌ లో పాల్గొనేందుకు డేట్లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సవ్యసాచి చిత్రాన్ని నవంబర్‌ లో విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.
Tags:    

Similar News