ఆ మలయాళ రీమేక్ అటకెక్కినట్లేనా...?

Update: 2020-06-16 14:00 GMT
సినీ ఇండస్ట్రీలో రీమేక్ ల ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఆల్రెడీ ఒక భాషలో హిట్ అయిన సినిమా కావడంతో రిస్క్ ఉండదని నిర్మాతలు భావిస్తుంటారు. ఈ రీమేక్‌ లు ఎక్కువ శాతం హిట్ అవ్వడమే కాకుండా నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఇతర భాషల హిట్ సినిమాల రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న రీమేక్ సినిమా ''అయ్యప్పనుమ్ కోసియుమ్''. ఈ సినిమా మలయాళంలో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై ఘన విజయం సాధించిది. పృథ్వీరాజ్, బిజూ మీనన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుందని భావించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. అయితే అప్పటి నుండి తెలుగు రీమేక్ లో ఎవరు నటించబోతున్నారు.. ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. కాకపోతే ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోలు ఎవరనే దానిమీద క్లారిటీ లేదు. అయితే ఒక హీరోగా దగ్గుబాటి రానా నటిస్తున్నడంటూ వార్తలు వస్తున్నాయి.

కాగా 'అయ్యప్పనుమ్ కోసియుమ్' కథ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఇగోల వల్ల, వారి జీవితాల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉంటుంది. అయ్యప్పనుమ్ క్యారక్టర్ కి ఫస్ట్ హాఫ్ లో పెద్దగా ప్రాధాన్యం ఉండదని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో కూడా మూడు నాలుగు మెయిన్ సీన్స్ మాత్రమే ఉంటాయి. మరి అలాంటి పాత్ర చేయడానికి మరో స్టార్ హీరో అంగీకరిస్తాడా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. మన నేటివిటీకి మార్చినా ఆ మలయాళ వాసన మనవాళ్లకు నచ్చుతుందో లేదో అనే డౌట్. అసలు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందా.. లేక 'విక్రమ్ వేద' రీమేక్ లాగే అటకెక్కనుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'విక్రమ్ వేద' సినిమా కూడా తమిళ్ లో సూపర్ హిట్ అవడంతో పోటీపడి ఈ సినిమా రైట్స్ కొన్నారు. కానీ ఈ సినిమా ఇంత వరకు పట్టాలెక్కలేదు.. ఎక్కే అవకాశమే లేదు అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పుడు 'అయ్యప్పనుమ్ కోసియుమ్' పరిస్థితి కూడా అలానే ఉంటుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలపై రీమేక్ రైట్స్ కొన్నవారు స్పందించి త్వరగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఈ వార్తలకు చెక్ పెడతారేమో చూడాలి.
Tags:    

Similar News