నవంబర్ అంటే టాలీవుడ్ రిలీజ్ లకు డెడ్లీ మంథ్ అని డిక్లేర్ చేశారు పండితులు. ఈ సీజన్ లో సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఎవరూ సాహసించరు. కానీ ఈసారి మాత్రం సన్నివేశం వేరుగా ఉంది. ఈ నెలలో ఏకంగా 20 వరకూ చిన్న సినిమాలు ఒకదాని వెంట ఒకటిగా వారం వారం రిలీజైపోయాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క వారం. అయితే ఇప్పటివరకూ వచ్చి సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది? అన్నదానిపై ట్రేడ్ విశ్లేషిస్తే షాకిచ్చే నిజాలే తెలిసాయి.
నవంబర్ లో సినిమాలన్నీ ఇంచు మించు గా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడి లాస్ అయ్యాయి. నవంబర్ ను చాలా మంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు అన్ సీజన్ గా భావిస్తారు. అందుకే ఈ నెలలో క్రేజీ ప్రాజెక్టులు.. స్టార్ హీరోల సినిమాలను రిలీజ్ చేయడానికి ఎవరు సాహసం చేయరు. అటు దసరా... ఇటు క్రిస్ మస్ కు ఆ సినిమాలను విడుదల చేస్తారు. దీంతో నవంబర్ కు పెద్ద సినిమాల ఎఫెక్ట్ అంతగా ఉండదు. అందుకే ఎక్కువగా చిన్న సినిమాలు ఈ నెలలో విడుదలవుతాయి. కాస్త బావున్నవి డబ్బులు వచ్చేస్తాయి. కంటెంట్ ఉన్న చిన్న సినిమా నిర్మాతలు గట్టెక్కేస్తారు. అయితే ఈ సారి నవంబర్ అన్ సీజన్ అనే అభిప్రాయానికి తగ్గట్టే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం నష్టాలు గా నిలిచాయి.
విజయ్ దేవరకొండ నిర్మాణంలో తెరకెక్కిన `మీకు మాత్రమే చెప్తా` టార్గెట్ చిన్నదే అయినా హిట్ అందుకోలేకపోయింది. 7 చేపల కథ కు డీ గ్రేడ్ అన్న టాక్ వచ్చినా మొదటి రోజు మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చాయి. నిర్మాత సేఫ్ అయ్యారు. చిన్న బడ్జెట్ కాబట్టి లాభాలొచ్చాయట. ఇక శ్రీవిష్ణు తిప్పరా మీసం డిజాస్టర్ గా నిలిచింది. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రం సందీప్ కిషన్ ఖాతాలో మరో ఫ్లాప్ గా నిలిచింది. ఏదో ఆశిస్తే ఈ సినిమాకి కలెక్షన్లు పెద్దగా సంతృప్తి కరంగా లేవని తేలింది. డిస్ట్రిబ్యూటర్స్ 10 - 15 శాతం పైగానే నష్టాలొచ్చాయట.
డబ్బింగుల్లో విశాల్ నటించిన యాక్షన్ కు అసలు తెలుగు ప్రేక్షకుల నుండి పెద్ద గా రెస్పాన్సే లేదు. విజయ్ సేతుపతి నటించిన `విజయ్ సేతుపతి` సినిమాకు కూడా అసలు ఏమాత్రం కలెక్షన్స్ లేవని తేలింది. జ్యోతిక నటించిన `జాక్ పాట్` ను కూడా అసలు ప్రేక్షకులు పట్టించుకో లేదు. కనీసం ఓ లుక్ కూడా వేయలేదని చెప్పాలి. ఇవి కాకుండా ఈ నెలలో మరో 15 సినిమాలు విడుదలయ్యాయి. వాటి గురుంచి చాలా మందికి తెలియకుండానే వెళ్లి పోయాయి.
ఇక ఈ శుక్రవారం విడుదలైన సినిమాలలో ఈషా రెబ్బా నటించిన `రాగల 24 గంటల్లో` సినిమా ఫర్వాలేదనిపించిందట. సరైన క్యాస్టింగ్ లేకపోవటం బాగా బడ్జెట్ ఎక్కువ అవ్వటం వలన నిర్మాతకు నష్టం రావచ్చని విశ్లేషిస్తున్నారు. ఈసినిమా టెక్నీషియన్స్ కి మంచి పేరు వచ్చింది. `జార్జ్ రెడ్డి` కలెక్షన్స్ పరిస్థితి ఓపెనింగ్స్ పర్వలేదనిపించుకుంది. సేఫ్ అయ్యే ఛాన్స్ ఉందట. కారణం రేలీజ్ ముందు హైప్ రావడం తో యావరాజ్ గా ఆడుతోందట. ఏపీ రైట్స్ కొన్న అభిషేక్ ఫిలిమ్స్ చివరి అంచు లో వున్నారు. ఇక జార్జిరెడ్డి నిర్మాత 8 కోట్ల బడ్జెట్ పెట్టారట. అదే నిజం ఐతే నిర్మాత కి మాత్రమే నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. నూతన ప్రయోగంగా తీసిన బీచ్ రోడ్ చేతన్ సినిమా కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు తీసినది. మోర్నింగ్ షో ఫ్రీ వేశారు కాబట్టి ఫుల్స్ అయ్యింది. తర్వాత థియేటర్లు ఖాళీ.
ఇవి కాకుండా నవంబర్ లో చిన్న సినిమాలు బాగానే రిలీజైనప్పటికి వాటిపై ప్రేక్షకులు రవ్వంత కూడా ఆదరణ చూపలేదు. ఇప్పటివరకూ చూసుకుంటే నవంబర్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయనే చెప్పాలి. ఇక ఈ నెలాఖరు 29న విడుదల కానున్న సినిమాల్లో నిఖిల్ `అర్జున్ సురవరం`.. ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వస్తున్నాయి. ఈ వారం కమ్మరాజ్యంలో బాగా ఓపెనింగ్ వచ్చే సినిమా అని అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవలే వచ్చిన రఘుపతి వెంకయ్య మంచి బయోపిక్. ప్రతి సినిమా పర్సనాలిటీ చూడాల్సిన సినిమా అని ప్రచారమైంది. నరేష్ నటన ఆకట్టుకుందని టాక్. డబ్బులు వస్తాయా లేదా అన్నది తర్వాత చూడాలి. గౌతమ్ మీనన్-ధనుష్ కాంబోలో వస్తున్న `తూటా` ఉన్నాయి. ఇవి ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవి. ఈ మధ్య కాలంలో థియేటర్ వారికి డిస్ట్రిబ్యూటర్స్ కి ఖైదీ మాత్రమే ఊరట మిగిల్చింది. అదీ నవంబర్ సంగతి.