బిగ్‌ బాస్ 6 : నామినేషన్‌ ట్విస్ట్‌.. కెప్టెన్‌ కి డబుల్‌ ఇతరులకు సింగిల్‌

Update: 2022-09-13 05:36 GMT
బిగ్ బాస్ సీజన్‌ 6 మొదటి వారం పూర్తి చేసుకుని రెండవ వారంలో అడుగు పెట్టి అప్పుడే రెండవ ఎలిమినేషన్ నామినేషన్‌ ఎపిసోడ్‌ ని కూడా ముగించుకుంది. నిన్న సోమవారం రసవత్తరంగా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరిగింది. సాదారణంగా అయితే ప్రతి కంటెస్టెంట్ కూడా ఇద్దరు చొప్పున నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి బిగ్‌ బాస్ నిజంగా బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చి కంటెస్టెంట్స్ కి మరియు ప్రేక్షకులను సర్‌ ప్రైజ్ చేశాడు.

ఈ వారం ఒక్కరు ఒక్కరిని మాత్రమే నామినేట్‌ చేయాల్సి ఉంటుందని బిగ్‌ బాస్ ప్రకటించాడు. అయితే బిగ్‌ బాస్ ఈ వారం కెప్టెన్ అయిన బాలాదిత్యకి మాత్రం డబుల్‌ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన్ని ఏ ఒక్కరు నామినేట్‌ చేయకూడదు అలాగే ఆయన ఇద్దరిని నామినేట్‌ చేసే అవకాశంను బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. ఇది బాలాదిత్య కు చాలా పెద్ద పరీక్ష అన్నట్లుగా మారింది.

నామినేషన్‌ పక్రియలో హోరా హోరీగా కొందరు మాటల యుద్దం చేసుకున్నారు. ప్రతి సోమవారం ఎపిసోడ్‌ మాదిరిగానే నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా కంటెస్టెంట్స్‌ నిప్పులు చెరిగినట్లుగా మాట్లాడుకుంటూ ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కొందరు మీద మీదకు వెళ్లడం తో గొడవ జరిగే వరకు వెళ్లింది. కొందరు నామినేషన్ ని తీసుకోలేక తమను నామినేట్‌ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తానికి రసవత్తరంగా సాగిన నామినేషన్ పక్రియలో చివరికి రాజ్‌.. షాని.. అభినయశ్రీ.. గీతూ.. రోహిత్‌.. ఫైమా.. రేవంత్‌ లు నామినేట్‌ అయ్యారు. గీతూ మరియు రేవంత్‌ లకు కాస్త ఎక్కువగానే ఓట్లు పడ్డాయి.

వారిపై ఇంటి సభ్యులు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో తాజా ఎపిసోడ్‌ తో క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా గీతూ మరియు రేవంత్‌ ల మధ్య గొడవ పీక్స్ కు చేరింది. ఒకరిపై ఒకరు కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేయడంతో నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది.

గత వారం ఎలిమినేషన్ లేక పోవడంతో ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తోంది. దాంతో డబుల్‌ ఎలిమినేషన్ ఉన్న వారంలో నామినేట్‌ అవ్వడంతో కొందరు కంటెస్టెంట్స్ కాస్త సీరియస్ గా రియాక్ట్‌ అవ్వడం.. ఆందోళన చెందడం వంటివి చేస్తున్నారు. అందుకే ఈ వారం ఆట మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News